fbpx

అర్హత లేని వ్యక్తిని అందలం ఎక్కించిన కోడి కత్తి : రఘురామకృష్ణంరాజు

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…చేసేది అంతా అరాచకాలు…చెప్పేది మాత్రం పెత్తందారులు మీధ పోరాటం చేస్తున్నా అని అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసిపి రెబల్ ఎంపి రఘరామకృష్ణం రాజు విమర్శించారు. గురువారం ఢిల్లీ లో కోడికత్తి నిందితుడు తల్లి సావిత్రమ్మ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు కు అయినా న్యాయం జరిగింది అని.. ఆ తల్లికి పోరాటం కు స్వాంతన చేకూరినందుకు సంతోషంగా ఉంది అన్నారు. ప్రజా జీవితంలోకి వచ్చిన తరువాత శ్రీనుకు ప్రాణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అన్నారు.కోడి కత్తి దాడిలో నిందితుడు శ్రీనివాస్ కేసులో పాత్రధారినే మాత్రమే…ఎవరో సృష్టించిన నాటకములో కేవలము ఒక పాత్రధారిగా ఉన్నాను అని మొదటి నుంచి శ్రీనివాస్ చెప్తున్నారని అన్నారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ నిజాలు అన్ని తెలుస్తాయిని అన్నారు.నిర్దోషిగా శ్రీను బయటకు వచ్చాడు… నిజ దోషులు ఆలస్యం అయిన సరే శిక్షించబడతారు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్క శ్రీనివాస్ మీదనే కాదు….సుమారు 300 పైగా ఎస్సీ ..ఎస్టీ ల మిధ ఎన్నో అరాచకాలు ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు.100 మంది మైనార్టీ ల మీద ఇటువంటి అట్రాసిటీ లు చేశారు….మాస్క్ అడిగినందుకు….మాస్క్ పెట్టుకోలేనందుకు హత్య చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాట్లాడితే నా ఎస్సీలు …నా ఎస్టీ లు అని…చివరకి వాళ్ళకి చేసింది ఏమీ లేదని…అన్యాయం తప్ప అని ధ్వజమెత్తారు..గత ప్రభుత్వం లో దళితులకు సంబంధించి 27 అధ్బుతమైన పథకాలు రద్దు చేశారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అన్యాయం చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చేయలేదు అని విమర్శించారు…కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదకాలను డైవర్ట్ చేసి విపరీత మిన అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి అను నిత్యం ఎస్సీ..ఎస్టీ .మైనార్టీలకు దినోద్ధారాకుడు అని మాటలు చెప్పడం చాలా దారుణం అని పేర్కొన్నారు. నేడు మూడు రాజ్య సభ స్థానాల్లో తన సామాజిక వర్గానికే ఇచ్చుకుని అదే సామాజిక న్యాయం అంటున్నారని పేర్కొన్నారు. కోడి కత్తిశ్రీను కోసం న్యాయ పోరాటం చేస్తున్న సమత సైనిక్ దళ్ చేస్తున్న పోరాటం అభినందనీయం అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *