fbpx

కేశినేని నాని పై సంచలన వ్యాఖ్యలు చేసిన సోదరుడు చిన్ని.. వ్యక్తుల స్థాయిను నిర్ణయించేది ప్రజలే అంటూ చురకలు..

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో భేటీ అనంతరం కేశినేని నాని తనకు తాను రతన్ టాటా, ప్రధాని మోదీలతో పోల్చుకుంటున్నారని కానీ మన స్థాయి ఏంటో నిర్ణయించేది ప్రజలు అని కేశినేని చిన్ని తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడుతూ…టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్థాయి ఎంటి అని నాని అడుగుతున్నారని…. యువ గళం పాదయాత్ర ద్వారా లోకేష్ నాయకత్వ పటిమను ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. హెచ్ సిఎల్,ఇతర సాఫ్ట్ వేర్ కంపెనీలు లోకేష్ కృషి వలనే వచ్చాయని పేర్కొన్నారు. గతంలో జగన్ ఒక అవినీతి పరుడని ,మూడు రాజధానులు పేరుతో రాష్ట్రాన్ని అస్తవస్త్యం చేశారన్న నాని.. తాజాగా జగన్ ను కౌగిలించుకోవడం అంటే ఇంత కన్నా ధౌర్బాగ్యం ఇంకోటి ఉండదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.1999 సంవత్సరం నుంచే మా కుటుంబంలో గొడవలు ఉన్నాయని, పేర్కొన్నారు. తమ కుటుంబ గొడవలతో చంద్రబాబు కు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.

సేవ కార్యక్రమాలు ద్వారా తాను ప్రజలలో ఉంటున్నానని, ఎంపి గా పోటీ చేస్తానని ఎక్కడ చెప్పలేదన్నారు.మీడియాలో తనను నాని చులకనగా మాట్లాడారని.. కుటుంబ బాధ్యత తీసుకున్న తాను ఎక్కడ ఆయన మీద ఎక్కడ విమర్శలు చేయలేదని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డితో నాని భేటీ అయిన అనంతరమే చంద్రబాబును, టిడిపి కార్యకర్తలను విమర్శిస్తున్నారని, ఇష్టానుసారంగా తిడితే సహించేది లేదని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.నాని గత నాలుగు ఎండ్లుగా వైసిపి నాయకుల అందరితో కోవర్ట్ గా చేస్తున్న విషయం అందరికి తెలిసిన విషయనేనని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఎలక్షన్స్ వచ్చేసరికి వైసిపి లో జాయిన్ అయ్యారని వెల్లడించారు. టిడిపి నుంచి మహామహులు వెళ్ళినప్పుడే ఖాళీ అవ్వలేదని …ఇద్దరు, ముగ్గురు పోయినంత మాత్రం నా ఏమి నష్టం జరగదు అని పేర్కొన్నారు. 2019 నుంచి కార్యకర్తలు ..ఎన్నో కష్టాలను,కేసులను ఎదుర్కొని పార్టీని కనిపెట్టుకొని ఉన్నారని వారే మా బలం అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *