fbpx

లెనిన్ మార్గం అనుసరణీయం : కట్టా కృష్ణారావు

Share the content

ప్రపంచ మానవాళికి విముక్తి మార్గాన్ని చూపి అమలు చేసిన మహా మేధావి వ్లాదిమిర్ లెనిన్ అని పూర్వ అధ్యపకులు కట్టా కృష్ణారావు తెలిపారు. సోమవారం కాకినాడ స్థానిక ఇంద్రపాలంలో సిపిఎం కాకినాడ రూరల్ మండలం కమిటీ అధ్వర్యంలో లెనిన్ వర్ధంతి సందర్భంగా సిపిఎం నాయకులు అమరజీవి వాసంశెట్టి సూర్యారావు స్మారకంగా “విఎస్ఆర్ ఐడియల్ స్టడీ సెంటర్” ను గుత్తుల రామకృష్ణ, మట్టా హరినాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కట్టా కృష్ణారావు మాట్లాడుతూ…మార్క్సిజాన్ని ప్రపంచంలో మొదటిసారి అన్వయించి రష్యాలో విప్లవం సాధించిన మహా నేత లెనిన్ అని పేర్కొన్నారు. లెనిన్ ఒక రష్యాకు మాత్రమే చెందిన నేత కాదని, ప్రపంచ మానవాళికి విముక్తి మార్గాన్ని చూపిన కార్య దీక్షాపరుడని కొనియాడారు. ప్రపంచంలో అనేక దేశాలు సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతుంటే ఒక్క సోషలిస్టు దేశాలు మాత్రమే ఆ సంక్షోభాల భారం నుండి ప్రజలను రక్షించే పాలన ఉందని పేర్కొన్నారు. మార్క్సిజంను పెట్టుబడిదారులు శ్రద్ధగా అధ్యయనం చేస్తూ కార్మిక వర్గాన్ని ఏ విధంగా అనగదోక్కాలని చూస్తుంటే … ఈ సిద్ధాంతం ఆధారంగా విముక్తి చెందాల్సిన శ్రామిక వర్గాలు మాత్రం అధ్యయన విషయంలో వెనుకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

సభకు అధ్యక్షత వహించిన పెద్దింశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ… రష్యాలో విప్లవాన్ని సాధించిన లెనిన్ ఒక మహిళా జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తదుపరి విప్లవం ఎక్కడ వస్తుందని ప్రశ్నించగా… భారతదేశంలో విప్లవం వచ్చే అవకాశాలున్నాయని లెనిన్ చెప్పారన్నారు. కానీ భారతదేశంలో కమ్యూనిస్టులు అదనంగా ఎదుర్కొనే ఒక ప్రత్యేక అడ్డంకి కులం, ఆ కులాన్ని కాపాడే మతం అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితినీ విశ్లేషించడం చూస్తుంటే నేటికీ ఆయన భారతదేశంపై అంచనా నిజమైంది అని వెల్లడించారు.

సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్ మాట్లాడుతూ …నేటి తరానికి విజ్ఞానాన్ని అందించేందుకు స్టడీ సెంటర్ ప్రారంభం కావడం అభినందనీయమన్నారు. స్టడీ సెంటర్ కన్వీనర్ సిహెచ్. కిరణ్ కుమార్ మాట్లాడుతూ…. విద్యార్థులకు, యువకులకు, మహిళలకు, మధ్యతరగతి ఉద్యోగులకు నిరంతరం సాంఘీక, సామాజిక, సాంస్కృతిక, రాజాకీయ అంశాలుపై నిరంతరం అవగహన కల్పించడానికి కృషి చేస్తామని తెలిపారు.లెనిన్ గుర్తించి, ఆచరించిన విశ్వమానవ విముక్తి భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం స్టడీ సెంటర్ తన వంతు పాత్ర పోషిస్తాదని చెప్పారు. అనంతరం జుత్తుగ శ్రీనివాసరావు అధ్వర్యంలో ప్రజానాట్య మండలి దళం విప్లవ గేయాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ కన్వీనర్ తిరుమలశెట్టి నాగేశ్వరరావు, వి. చందర్రావు, ఆర్ పి ఐ నాయకులు ఏ. రామేశ్వరరావు, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు ప్రభాకర్ వర్మ, సైన్స్ ఉద్యమ నాయకులు వర్మ, ఉద్యోగ సంఘాల నాయకులు రవికుమార్, చెల్లారావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *