fbpx

కెసిఆర్ కు కాలేశ్వరం సెగ

Share the content

తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన నమ్ముకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిబంధకంగా మారేలా కనిపిస్తోంది. తెలంగాణ మొత్తాన్ని సస్యశ్యామలం చేస్తుంది అని భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం డోళ్ల అనేలా చేస్తున్న ప్రచారం ఎక్కువ అవుతోంది. కాంగ్రెస్ దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తోంది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ లో టికెట్లు కోసం కనిపించని అభ్యర్థులు ప్రస్తుతం టికెట్ల కోసం పోటీపడే పరిస్థితికి వచ్చారు. దీంతోపాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి సాధించడంతో తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకం అయ్యాయి. దీనిలో భాగంగా తెలంగాణలో కీలకమైన అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బారజ్ కృంగిపోవడంతో పాటు మరో బారాజ్ కూడా లీకులు వస్తున్నాయి అన్న ప్రచారం నేపథ్యంలో మొత్తం ప్రాజెక్టు పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు తెలంగాణకు వరంగల్ మారుతుందని వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికార పీఠాన్ని నిలబెడుతుందని కేసీఆర్ భావిస్తే దానికి విరుద్ధంగా ప్రస్తుతం జరుగుతోంది.

** కాలేశ్వరం ప్రాజెక్టు అనేది అత్యంత పెద్ద ప్రాజెక్టు. ముఖ్యంగా తెలంగాణలో కిందికి ప్రవహించే గోదావరి నది నుంచి నీటిని తోడి ప్రాజెక్టుల్లో నిలువ చేసుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రాణహిత నది గోదావరిలో కలిసే ప్రాంతానికి దిగువున ఎక్కువగా నీరు ఉండే ప్రాంతంలో నీటిని పంపిణీ ద్వారా మేడిగడ్డ జలాశయానికి తరలిస్తారు. మొత్తం కాలేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ జలాశయం గుండెకాయ లాంటిది. అలాంటి జలాశయం ఇటీవల కృంగిపోవడం ఇతర ప్రాజెక్టులు కూడా అంతంత మాత్రం గానే ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో కాలేశ్వరం నిర్మాణం మీదే మొత్తం ఇప్పుడు చర్చ సాగుతోంది. సుమారు 80 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు మొత్తం అవినీతి అక్రమాలమయం అనేలా ఇప్పుడు కాంగ్రెస్ విస్తృతంగా ప్రజల్లోకి ప్రచారం మొదలుపెట్టింది. జాతీయ ప్రాజెక్టు చేయాలని కేసిఆర్ కోరుతుంటే… దీనికి విరుద్ధంగా కేసీఆర్ హయాంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు మొత్తం డొల్ల అనేలా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని చేస్తోంది. ఇది ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా తెలంగాణ ప్రజల్లోకి ప్రచారం కావడంతో… కాలేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్ కు ఓటు రాల్చడం మాట దేవుడు ఎరుగు… మొత్తం అధికారాన్ని మాయం చేసేలా తయారైంది. ఒకవేళ తెలంగాణలో టిఆర్ఎస్ కు దెబ్బ తగిలితే కచ్చితంగా కాలేశ్వరం గాయం చాలా పెద్దగా ఉంటుంది. అధికారం మారితే కనుక కేసిఆర్ కాలేశ్వరంలో కొట్టుకుపోయినట్లే అని రాజకీయ నిపుణులు చెబుతున్న మాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *