fbpx

అరాచక దోపిడీ పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం : కొండబాబు

Share the content

వైసిపి అరాచక పాలన నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని, కాకినాడ నగరాన్ని కాపాడుకోవాలని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. సోమవారం కాకినాడ 9 వ డివిజన్లో దుర్గమ్మ గుడిలో కొండబాబు, బిజెపి నాయకులు పైడా భవాన ప్రసాద్, జనసేన నాయకులు సత్యనారాయణ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం డివిజన్లో పర్యటించి తెలుగుదేశం కూటమి అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించి కర పత్రాలను పంపిణీ చేసారు.ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ…. రాష్ట్రంలో గత ఐదేళ్ల కాలంగా విధ్వంసకర అరాచక అవినీతి దోపిడీ పాలన కొనసాగుతుందని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ధరలను, ఇంటి పన్నులను, బస్ చార్జీలను విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచి, చెత్త పన్ను లను వేసి ప్రజల కష్టార్జితాన్ని జలగల్లా పట్టుకొని పీడించి దోచుకున్నారని ధ్వజమెత్తారు. ప్రశాంత వాతావరణము గల కాకినాడ నగరాన్ని డ్రగ్స్ గంజాయి నగరంగా మార్చడంతో యువత భవిష్యత్తును చిదిమేస్తున్నారని మండిపడ్డారు. వైసిపి ఐదేళ్ల అరాచక పాలనలో ప్రజలు తీవ్ర కష్టాలు పడ్డారని పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసి అభివృద్ధి పరిచామని….నేడు వైసిపి పార్టీ నాయకుల స్వార్థ ప్రయోజనాలు కోసం, అక్రమ వ్యాపారాలు కోసం కాకినాడ నగర అభివృద్ధి తుంగలో తొక్కి దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాకినాడ నగర ప్రజల ఆశీస్సులతో, తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ నాయకుల సహకారంతో భారీ మెజార్టీతో గెలిచి….. కాకినాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ..టిడిపి తోనే సుపరిపాలన లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.రానున్న ఎన్నికలలో 175 నియోజకవర్గాల్లో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవనున్నారని ధీమా వ్యక్తం చేశారు.

బిజెపి సీనియర్ నాయకులు పైడా భవన్ ప్రసాద్ మాట్లాడుతూ…. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అవినీతి పెచ్చిమీరిందని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేసి బయ బ్రంతులకి గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పైడా వెంకటనారాయణ, పైడా భవన్ ప్రసాద్, మల్లిపూడు వీరు, డివిజన్ తెదేపా అధ్యక్షులు వాసంశెట్టి చిట్టప్ప, లూటుకుర్తి మోహన్, జనసేన నాయకులు తంగెళ్ల వి.వి సత్యనారాయణ, గీసాల పని, చోడిశెట్టి రమేష్, తుమ్మలపల్లి నాని, తంగెళ్ల రాముడు, పక్కి మణిబాల, కొక్కలగడ్డ గంగరాజు, గౌతు చిన్ని, వెంకన్న బాబు, పెంకె అప్పారావు, కట్టా సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *