fbpx

2023 లో గణనీయంగా తగ్గిన నేరాలు

Share the content

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి. రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా పని చేయడం వలన 2023వ సంవత్సరంలో నేరాలు గణనీయంగా తగ్గాయని కాకినాడ జిల్లా ఎస్.పి. ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం, పోలీసింగ్ లో వినూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైనదని పేర్కొన్నారు.మరింత ద్విగుణీకృత ఉత్సాహంతో 2024 లో మెరుగైన పోలీసింగ్ సేవలను అందిస్తామని తెలిపారు.
గణనీయంగా నేరాల తగ్గుదల: విజబుల్ పోలీసింగ్, అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, మహిళా పోలీసు సేవల సమర్థవంతమైన నిర్వహణ, పీడి యాక్ట్ ప్రయోగం, గంజాయి, నాటుసారాయి పై ఉక్కుపాదం మోపడం తదితర చర్యల వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయిని పేర్కొన్నారు. 2022 లో 8,549 కేసులు నమోదు కాగా, 2020 లో 1019 కేసులు మాత్రమే నమోదైనవిన్నరు. 2022 సంవత్సరము తో పోలిస్తే 2023 సంవత్సరము 1530 కేసులు (F.I.R.లు) తగ్గుదల తో 18% తగ్గుదల నమోదు కాబడినది.

స్పందన: ప్రతి సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” కార్యక్రమంలో 2021 సంవత్సరానికి గాను 10,016 పిటిషన్లు రాగా, అన్నింటిని పూర్తి గా పరిష్కరించడం జరిగిందని తెలిపారు. 2022 సంవత్సరానికి గాను 2,480 పిటిషన్లు రాగా, వాటిని అన్నింటిని పూర్తి గా పరిష్కరించడం జరిగింది. 2023 సంవత్సరానికి గాను 2,929 పిటిషన్లు రాగా, వాటిలో 2908 పరిష్కారం చేయగా, 325 పిటిషన్లు పరిష్కరించవలసి వున్నదని పేర్కొన్నారు.జగన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా 2023 సంవత్సరానికి గాను 1,537 పిటిషన్లు రాగా, వాటిలో 1,517 పరిష్కారం చేయగా, 20 పిటిషన్లు పరిష్కరించవలసి వున్నదని వెల్లడించారు. జగన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కరించడంలో కాకినాడ జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో నిలపుకోవడం హర్షించదగ్గ విషయని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదాల వలన జరిగిన మరణాల 2022 సంవత్సరము తో పోలిస్తే 2023 సంవత్సరము 63 కేసులు (F.I.R.లు) తగ్గుదలతో 18% తగ్గుదల నమోదు కాబడినదని తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన ప్రమాదాల 2022 సంవత్సరము తో పోలిస్తే 2023 సంవత్సరము 126 కేసులు (F.I.R.లు) తగ్గుదలదు కలదని పేర్కొన్నారు. జిల్లా లో జోన్ ల వ్యవస్థ ఏర్పాటు, ప్రమాద రహిత దినాలుగా అన్ని రోజులను ప్రకటించి పని చేయడం), STOP-WASH GO. వంటి వినూత్న కార్యక్రమాల వల్ల, బ్లాక్ స్పాట్ ల ఐడెంటిఫికేషన్, రెక్టిఫికేషన్, ప్రమాద సమయాలను గుర్తించి ఆ సమయాల్లో పోలీసు నిఘా, ఎన్ ఫోర్సుమెంట్ పెంచడం జరిగింది. “Zone system” వల్ల రోడ్డు ప్రమాదాలను తగ్గించుటకు గాను “నో యాక్సిడెంట్ డే’ కార్యక్రమాన్ని జిల్లాలో 55 బ్లాక్ స్పాట్ లు,ఇతర ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ సిబ్బందిని నియమించి, రోడ్డ పై వాహన చోదకులకు అవగాహన కల్పించి, ప్రమాదాలను గణనీయంగా తగ్గించామని పేర్కొన్నారు.
మహిళలపై నేరాలు: విజబుల్ పోలీసింగ్, దిశ కార్యక్రమాల పటిష్ట అమలు, నేర ప్రభావిత ప్రదేశాల జియో మ్యాపింగ్, మహిళా పోలీసుల పర్యవేక్షణ తదితర చర్యల ద్వారా మహిళపై జరిగే తీవ్ర నేరాలు తగ్గుముఖం పట్టగా, కుటుంబ హింస కు సంబంధించిన నేరాలు కొంత మేర పెరిగాయి. అదే విధంగా వర కట్న హత్యలు, ఆత్మహత్య ప్రేరిత నేరాలు, కిడ్నాపులు, వరకట్న చావులు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే మహిళలపై వేధింపులు కు సంబంధించిన కేసులు 2022 లో 844 కేసులు, 2023 లో 555 కేసులు నమోదు అయ్యాయి. 2022 సంవత్సరము తో పోలిస్తే 2023 సంవత్సరము 289 కేసులు (F.I.R.లు) తగ్గుదల ఉందన్నారు.

ఎస్సీ,ఎస్టీ లపై నేరాలు: గ్రామ సందర్శనలు, నేర ప్రభావిత ప్రదేశాలను గుర్తించి నిఘా ఉంచడం, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, జిల్లా రివ్యూ మీటింగులు, నేరస్తుల పట్ల కఠినమైన చర్యలు చేపట్టడం ద్వారా ఎస్సీ,ఎస్టీ లపై జరిగే నేరాలు తగ్గుముఖం పట్టాయిని తెలిపారు.. 2022 లో 82 కేసులు నమోదు కాగా, 2023లో 51 కేసులు నమోదైనాయి. 2022 సంవత్సరము తో పోలిస్తే 2023 సంవత్సరము 31 కేసులు (F.I.R.లు) తగ్గుదల కలదు. తగ్గుదల శాతం 38%..సైబర్ సోషల్ మీడియాపై, 1930 (సైబర్ క్రైమ్స్, లోన్ యాప్స్ హెల్ప్ లైన్ నెంబర్ గురించి), ప్రజలకు, విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన సదస్సులు జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో, ముఖ్యమైన కూడళ్ళలో, వివిధ పాఠశాలలు, కళాశాలలందు, ఫ్లెక్స్ ల ద్వారా, సైన్ బోర్డు ల ద్వారా పోలీసు వారు మరియు కళాజాత బృందాలతో అవగాహన కల్పించడం జరిగింది. 86 సైబర్ క్రైమ్ & యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్లు నిర్వహించడం జరిగింది. 2022 లో 1059 సైబర్ ఫిర్యాదులు నమోదు కాగా, Rs. 9,64,500/- అదేవిధంగా 2023 లో 1854 ఫిర్యాదులు నమోదులో Rs. 2,24,80,284/- ను ఫిర్యాదుదారులకు సంబంధించి నష్టపోయిన నగదును వివిధ బ్యాంకుల ద్వారా హోల్డ్ చేయబడి, Rs. 4,06,650/- రూపాయలను సంబంధిత ఫిర్యాదుదారులకు వెనకకు తెప్పించడం జరిగింది. సైబర్ క్రైమ్ నేరాలకు సంబందించి 2022 లో 28 కేసులు నమోదు చేయగా, 2023 లో 37 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.. కన్విక్షన్ బేస్డ్ పోలిసింగ్ ద్వారా నేరారోపణ ఆధారిత విధానం, రోజువారీగా వివాదాస్పద కేసులు గుర్తింపు – పర్యవేక్షణ. సాక్షులకు సరైన విధంగా అవగాహన కల్పించడం, NBWలను సకాలంలో అమలు చేయడం, రేప్ మరియు పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా- 2022 లో 4358 కేసులలో కోర్టు తీర్పులు రాగా 2231 కేసులలో ముద్దాయిలకు శిక్షలు విధించినారు. 2023 లో 4606 కేసులలో కోర్టు తీర్పులు రాగా 2817 ముద్దాయిలకు శిక్షలు విధించినారు. 2022 సంవత్సరము తో పోలిస్తే 2023 సంవత్సరము 536 కేసులు ఎక్కువగా శిక్షలు విధించడం జరిగిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *