fbpx

జీవితంలో క్రీడలు ఓ భాగం కావాలి: కన్నబాబు

Share the content

జీవితంలో క్రీడలు ఓ భాగం కావాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. స్థానిక నక్కా సూర్యనారాయణమూర్తి జెడ్సీ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ కరప(సీఏకే) అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ క్రికెట్ ప్లేయర్ దేవు మధు వీరేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు గురువారంతో ముగిశాయి. టోర్నీ పోటీల్లో 24 జట్లు పాల్గొనగా ఫైనల్స్ పోటీలో గురజనాపల్లి టీమ్ కరప జట్ల మధ్య జరిగింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన కరప టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 113 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్ కు బరిలోకి దిగిన గురజనాపల్లి జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 15.1ఓవర్ల లో 115 పరుగులతో లక్ష్యాన్ని అధిగమించి విజేతగా నిలిచింది. టోర్నీ విజేత అయిన గురజనాపల్లి జట్టుకు దేవు సూర్యనారాయణమూర్తి పేరున రోలింగ్ గోల్డ్ కప్ ని, షీల్డ్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన కరప జట్టుకు పేపకాయల వరప్రసాద్, భోగిరెడ్డి వెంకటేశ్వరరావుల జ్ఞాపకార్థం ట్రోఫీ ని, షీల్డ్ ను మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు అందజేశారు. వివిధ కేటగిరీలలో ప్రతి భచూపిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.

టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ …కరప హైస్కూల్ క్రీడామైదానాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ గ్రౌండ్ గా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.. గత 32 ఏళ్లుగా సంక్రాంతిని పురస్కరించుకుని మధువీరేష్ క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. మాజీ ఎమ్మెల్సీ చిక్కాల మాట్లాడుతూ.. కరపలో మూడు దశాబ్దాలుగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్న సీఏకే అధ్యక్షుడు మధువీరేష్ ను అభినందించారు. జెడ్పీటీసీ సభ్యుడు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్తిబాబు, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డిపల్లి రమేష్, కాకినాడ కార్పొరేషన్ మూడో వార్డు కార్పొరేటర్ వడ్డి మణికుమార్, రాజారపు మహేష్, తోట సుధీర్, చిక్కాల దొరబాబు, తుమ్మల బాబు, కాకినాడ సిటీ జనసేన ఇన్చార్జి ముత్తా శశిధర్, బొండా సూర్యారావు, పంతం సందీప్ లు మాట్లాడుతూ ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు నక్కా భీమ్, గోన శివ, దేవు శివ, సీఏకే ఫ్రెండ్స్ లెవెన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *