fbpx

కాకినాడ రూరల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ : పితాని అన్నవరం

Share the content

రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని రమ్య ఆసుపత్రి అధినేత డాక్టర్ పితాని అన్నవరం స్పష్టం చేశారు. ప్రస్తుత కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కురసాల కన్నబాబుకు టికెట్ కేటాయిస్తే ఓడిపోతాడంటూ తన వద్ద కార్యకర్తలు చెప్తున్నారని వెల్లడించారు. బుధవారం గాంధీ నగర్లో ఉన్న తన రమ్య ఆసుపత్రిలో విలేకరులతో డాక్టర్ అన్నవరం సమావేశాన్ని నిర్వహించారు. తాను కాకినాడ రూరల్లో తన పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందుతున్నానన్నారు.

తాను జగన్ అభిమానినని అందువల్ల జగన్ అప్పగించిన బాధ్యతలను ఇబ్బంది పడకుండా నిర్వహించినట్లు చెప్పారు. అందులో భాగంగా గతంలో మండపేటలో జగన్ తనను పనిచేయమన్నారని ఆ తర్వాత కాకినాడ రూరల్ కు వెళ్ళమని తనను జగన్ సూచించినట్లు పేర్కొన్నారు. ఇలా గడచిన ఐదేళ్ల కాలం నుంచి కాకినాడ రూరల్ అసెంబ్లీ పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరుండి చూసానని వాటిని అధిగమించి సుపరిపాలన అందించాలని అభిప్రాయం తన మనసులో కలిగిందన్నారు. ఇదే విషయాన్ని తన మిత్రులు, కాకినాడ రూరల్ నియోజవర్గ ప్రజలు, వైసీపీ కార్యకర్తలు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి మీరే పోటీ చేయాలంటూ తనపై ఒత్తిడి చేస్తున్నారని అన్నవరం చెప్పారు. రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని అతను ఓడిపోతాడని తన దృష్టికి కార్యకర్తలు తీసుకొచ్చినట్లు చెప్పారు. వారందరూ వైసీపీ టికెట్ కావాలని అడగమని లేని పక్షంలో స్వతంత్రంగా పోటీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారన్నారు. తాను పోటీ చేయడం ఖాయమని కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించాలని అన్నవరం కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *