fbpx

దేవుడు పేరుతో ద్వారంపూడి కోట్ల దోపిడి

Share the content

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి దోపిడికి హద్దు అదుపు లేకుండా పోయిందని, దేవుడు పేరుతో కూడా ద్వారంపూడి దోపిడీ చేస్తున్నాడని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు విమర్శించారు.
సినిమా రోడ్డు సంత చెరువు సెంటర్ కనకదుర్గమ్మ ఆలయం నందు ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం తొలగింపు పై శుక్రవారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తు నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో కాకినాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ ఆమోదంతో నందమూరి తారకరామారావు విగ్రహం ఏర్పాటు చేశామని తెలిపారు. దేవుడు పేరుతో ద్వారంపూడి చేస్తున్న దోపిడికి అడ్డు ఉందని, అర్ధరాత్రి వేళ ద్వారంపూడి తన అనుచరులుతో విగ్రహాన్ని ధ్వంసం చేయుటకు పూనుకున్నారని విమర్శించారు. అర్ధరాత్రి వేళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేరుకుని ద్వారంపూడి అనుచరులను ప్రశ్నించగా దేవాలయానికి అడ్డుగా ఉన్నదని అందువల్ల ప్రక్కకు జరుపుతున్నామని తెలిపారు. అర్ధరాత్రి వేళ చేయవలసిన అవసరం ఏముందని టిడిపి కార్యకర్తలు ప్రశ్నించగా పారిపోయారని తెలిపారు. దేవాలయానికి ఎటువంటి అడ్డుగా లేకపోయినా విగ్రహాన్ని తొలగిస్తున్నారని తెలిపారు.

దేవాలయానికి ఈశాన్యం వైపున కాకినాడ నగరపాలక సంస్థ అనుమతి లేకుండా అనధికారికంగా ఐదు షాపులు నిర్మించి ఒక్కొక్క షాపుకు 25 లక్షల చొప్పున కోటి రూపాయల సొమ్మును ద్వారంపూడి దోచుకున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహం ఉన్న ప్రదేశంలో కూడా షాపులు నిర్మించి దోచుకోవడానికి కుట్రలు పన్నారనీ తెలిపారు. కౌన్సిల్ ఆమోదంతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా తొలగించే అధికారం ద్వారంపూడికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. విగ్రహాన్ని తొలగిస్తుంటే నగరపాలక సంస్థ, ఎండోమెంట్స్ అధికారులు, పోలీసులు ప్రేక్షకు పాత్ర వహిస్తూ ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహించారు.

కాకినాడ నగరంలో ట్రాఫిక్ కు అంతరాయంగా అనేక విగ్రహాలు ఉన్నాయని, వాటిపై చర్యలు చేపట్టకుండా, ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం లేని ఎన్టీఆర్ విగ్రహాన్ని దోపిడి కోసం అర్ధరాత్రి వేళ తొలగించడానికి ప్రయత్నాలు చేపట్టారని పేర్కొన్నారు. అధికారులు ప్రమేయము లేకుండా అర్ధరాత్రి వేళ అనధికారికంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తున్న ద్వారంపూడి, అతని అనుచరులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, వనమాడి ఉమాశంకర్, గదుల సాయిబాబా, బంగారు సత్యనారాయణ, పొంగా బుజ్జి, తుమ్మల రమేష్, గుజ్జు బాబు, ఓమ్మి బాలాజీ, చొల్లంగి వీరబాబు, చింతలపూడి రవి, కోడూరు పెద్ద, అమలకంటి బలరాం, రెడ్డీనం సత్తిబాబు, తుమ్మల సునీత, వీరంరెడ్డి వెంకటలక్ష్మి, చిట్నీడి దార, జొన్నాడ వెంకటరమణ, కడలి వెంకటలక్ష్మి, అరదాడి శివ, బలగం పరుశురాం, మల్లడి గంగాధరం, వానపల్లి పోలీస్, సికోటి అప్పలకొండ, చోడుపిల్లి సతీష్, మూగు రాజు, మాదే ఆంధ్రయ్య, ప్రేమానందం, గుత్తుల రమణ, AVD మెంటారావు, బుంగా నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *