fbpx

జగన్ రెడ్డి …నియంత పాలనను తరిమికొట్టడానికి బీసీలు సిద్ధం : కొండబాబు

Share the content

నాడు ..వెనకబడిన కులాలకు అండగా ఉంటానని మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నేడు.. బీసిలకు వెన్నుపోటు పొడిచి మోసం చేశారని కాకినాడ సిటీ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు విమర్శించారు. కాకినాడ సిటీ నియోజకవర్గం స్థానిక దుమ్ములపేట శ్రీరామ్ సెంటర్ నందు నగర బీసీ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం జయహో బీసీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధిలుగా తుని నియోజకవర్గ నాయకులు యనమల రామకృష్ణుడు,కొండబాబు కాకినాడ నియోజవర్గ పరిశీలకులు నాగిడి నాగేశ్వరరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ… బీ.సీ.ల అభివృద్ధికి కృషి చేసి.. వారికి అత్యున్నత పదవులు కల్పించి.. గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు.

గత ఎన్నికల్లో జగన్ రెడ్డి చెప్పిన మోసపూరిత మాటలు విని బీసీ లు జగన్ రెడ్డిని గెలిపిస్తే వారిపైనే దాడులు చేసి అనగతొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం బీసీ కులాల వారికి ఆదరణ పథకం ద్వారా కులవృత్తి పరికరాలు అందించి వారి ఆదుకుంది అని గుర్తు చేశారు. 55 నెలల జగన్ రెడ్డి పాలనలో బీసీ లపై దాడులు చేయించి వారిని ఆర్థికంగా… మానసికంగా దెబ్బతీశాడని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలలో జగన్ రెడ్డి నియంత పాలనను తరిమి కొట్టడానికి బీసి లు అందరూ సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యనమల రామృష్ణుడు మాట్లాడుతూ… కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి.. చైర్మెన్ పదవులు ఇచ్చి కనీసం కుర్చోవడానికి కుర్చీ కూడా ఏర్పాటు చేయలేదని బీసీల ద్రోహి జగన్ రెడ్డిని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడం జరుగుతుందని, అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా సూపర్ సిక్స్ పధకాలను తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి అన్ని వర్గాల వారిని ఆదుకుంటామని తెలిపారు.

నియోజకవర్గ పరిశీలకలు నాగిడి నాగేశ్వరరావు మాట్లాడుతూ… ఒక్క అవకాశంతో అధికారం చేపట్టిన జగన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీ లకు తీరని అన్యాయం చేస్తూన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఆర్థిక ప్రాణాలిక లేకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి బీసీలకు ఉపాధి అవకాశాలు, అభివృద్ధి, లేకుండా చేశాడని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నగర బీసీ సెల్ అధ్యక్షులు ఓమ్మి బాలాజీ, మల్లిపూడి వీరు, రజక సాధికార సమితి కన్వీనర్ ఏ.విడి. మెంటారావు, లీగల్ సెల్ అధ్యక్షులు దండుప్రోలు నాగబాబు, గదుల సాయిబాబా, తుమ్మల కొండలరావు, తుమ్మల సునీత రమేష్, ఏరిపిల్లి రాము, మూగు రాజు, చోడిపిల్లి సతీష్, మాదే అంద్రియ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *