fbpx

కాకినాడ జిల్లాలో 15,99,065 మంది ఓటర్లు : కృతికా శుక్లా

Share the content

కాకినాడ జిల్లాలో 15,99,065 మంది ఓటర్లుగా నమోదు అయినట్టు జిల్లా కలెక్టర్ డా కృతికా శుక్లా తెలిపారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 తుది జాబితాను సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా… అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ.. కాకినాడ జిల్లా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లాలోని 1,637 పోలింగ్ కేంద్రాల్లో 15,99,065 మంది ఓటర్లుగా నమోదు అయ్యాయన్నారు. ఇందులో 7,88,105 మంది పురుష ఓటర్లు, 8,10,781 మంది స్త్రీ ఓటర్లు, 179 మంది ఇతరులుగా ఉన్నారని ఆమె వివరించారు.
జిల్లాలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఓటర్లు
1.తుని నియోజకవర్గంలోని 223 పోలింగ్ కేంద్రాలలో 1,09,052 పురుషులు, 1,11,800 స్త్రీలు, 25 మంది ఇతరులు మొత్తం 2,20,877 మంది ఉన్నారన్నారు.

  1. ప్రత్తిపాడు నియోజకవర్గంలో 227 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,05,412 మంది పురుషులు 1,082,027 మంది స్త్రీలు, 20 మంది ఇతరులు మొత్తం- 2,13,639 ఓటర్లుగా నమోదు ఆయ్యారు.
  2. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో 242 పోలింగ్ కేంద్రాలులో 1,15,223 మంది పురుషులు,1,14,819 మంది స్త్రీలు, 4 మంది ఇతరులు మొత్తం- 23,0046 మంది ఓటర్లుగా ఉన్నారు.
  3. కాకినాడ రూరల్ నియోజకవర్గం లోని 264 పోలింగ్ కేంద్రాలలో 1,29,584 మంది పురుషులు, 1,31,591 మంది స్త్రీలు, 11 మంది ఇతరులు మొత్తం 2,61,186 మంది ఓటర్లుగా నమోదయ్యారు.
  4. పెద్దాపురం నియోజకవర్గంలోని 200 పోలింగ్ కేంద్రాలలో 1,04,446 మంది పురుషులు,1,07,478 మంది స్త్రీలు, 13 మంది ఇతరులు మొత్తం 2,11,937 మంది ఓటర్లుగా నమోదయ్యారన్నారు.
  5. కాకినాడ సిటీ నియోజకవర్గంలోని 233 పోలింగ్ కేంద్రాలలో 1,13,177 మంది పురుషులు, 1,23,166 మంది స్త్రీలు, 94 మంది ఇతరులు మొత్తం 2,36,437 మంది ఓటర్లుగా నమోదు అయ్యారు.
  6. జగ్గంపేట నియోజకవర్గంలోని 248 పోలింగ్ కేంద్రాలలో 1,11,211 మంది పురుషులు, 1,13,720 మంది స్త్రీలు ,12 మంది ఇతరులు మొత్తం 2,24,943 మంది ఓటర్లుగా నమోదయ్యారని కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు.

జిల్లాలు అక్టోబర్ 27న ప్రచురించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ నాటికి మొత్తం కాకినాడ జిల్లాలో 15,89,755 మంది ఓటర్లుగా నమోదు కాగా అందులో 704 78 మందిని అదనంగా వాటర్లుగా నమోదు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఇందులో 11510 మంది చనిపోయారని, 41958 మంది వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారన్నారు. 7,700 మంది డబుల్ ఓటర్లుగా గుర్తించగా 61,168 మంది ఓటర్లను తొలగించడం జరిగిందన్నారు. ఎస్ఎస్ఆర్-2024 రూపకల్పనలో 28471యొక్క సవరణలు చేయగా మొత్తం జిల్లాలో 15 లక్షల 99వేల 065 మంది ఓటర్లుగా నమోదయ్యారని కలెక్టర్ తెలిపారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో భాగంగా 18 నుండి 19 సంవత్సరాల మధ్య వారు 26, 059 మంది నూతనంగా నమోదు అయ్యాయన్నారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసేనాటికి జిల్లాలో 2,013 గృహాలలో 10 ఓటర్ల కంటే ఎక్కువ నమోదైనట్లు గుర్తించి వాటిని సవరించడం జరిగిందని ఇంకా ఎనిమిది గ్రుహాలలో 10 ఒట్లు పైన నమోదైన వారు ఉన్నారన్నారు.

ప్రత్తిపాడు మండలం గిరిజనాపురం గ్రామానికి సంబంధించిన 11 కుటుంబాలకు సంబంధించి 19 మంది గిరిజన ఒటర్లు నూతనంగా నమోదు చేయడం జరిగిందని గతంలో వీరు ఓటర్లుగా నమోదు కాలేదని కలెక్టర్ తెలిపారు.జిల్లాలో 6,937 మంది సెక్స్ వర్కర్ల ఓటర్లగా ఉన్నారని.. 179 మంది ట్రాన్స్ జెండర్లను ఓటర్లుగా నమోదైనట్లు ఆమె తెలిపారు. జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గత సంవత్సరం అక్టోబర్ 27 నుంచి నేటి వరకు సమావేశాలు నిర్వహించామని తెలిపారు. జిల్లాలో తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో ఒక్కొక్క పోలింగ్ కేంద్రం చొప్పున మొత్తం మూడు పోలింగ్ కేంద్రాలను నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని 1,637 పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులకు సంబంధించి విద్యుత్, ఫర్నిచర్, టాయిలెట్లు, తాగునీరు , ర్యాంప్ లను సమకూర్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కృతికాశుక్లా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *