fbpx

టిటిడి నిధులా? ద్వారంపూడి సొంత నిధులా ? : కొండబాబు

Share the content

కాకినాడ సాంబమూర్తి నగర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 2 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని గతంలో చెప్పిన ద్వారంపూడి…నేడు తన సొంత నిధులు 4 కోట్ల రూపాయలతో ఆలయ నిర్మాణం చేపట్టానని చెప్పడం విడ్డూరమని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కాకినాడ కార్పొరేషన్ కు నగర ప్రజలు చెల్లిస్తున్న రూ . 500 కోట్లు రూపాయలను ద్వారంపూడి దోచుకుని, వాటిని కప్పిపుచ్చుకోవడానికి పూజలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. గురువారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… టి.డి.ఆర్ బాండ్స్ పేరుతో 250 కోట్లు కొట్టేసి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తున్నారని తెలిపారు. గతంలో సురేష్ నగర్ ప్రభుత్వ భూమిపై TDR బాండ్ల రూపంలో ప్రజల సొమ్ము 160 కోట్ల దోచుకుని ….యజమాలను బెదిరించి దోచుకున్న ఐశ్వర్య గ్రాండ్ హోటల్ భూమి నందు వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారని గుర్తు చేశారు.

పగలు హిందువులు కోసం పూజలు నిర్వహించే ద్వారంపూడి రాత్రిలు ఒక క్రెస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని సభలలో చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తన స్వార్థ రాజకీయాల కోసం కులాలను మతాలను వాడుకున్న చరిత్రహీనుడు ద్వారంపూడి అని మండిపడ్డారు. పీఠాధిపతులు, మఠాధిపతులు, చాగంటి కోటేశ్వరరావు లాంటి ప్రముఖులు కాకినాడ నగరంలో నిర్వహించిన ఏ కార్యక్రమాలకు దుకాణాలు మూసివేయాలని సర్క్యులర్ లను జారీ చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దంపతులు పూజలో కూర్చుంటున్నారు కాబట్టే వ్యాపార దుకాణాలన్నీ మూసివేసి కార్యక్రమానికి హాజరు కావాలి లేకపోతే దుకాణ యజమానులపై చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేయడం దారుణమైన చర్య అని పేర్కొన్నారు. టి.డి.ఆర్. బాండ్లు రూపంలో దోచుకున్న ప్రజల సొమ్ము ద్వారoపూడి దగ్గర ఇంకా 400 కోట్లు ఉన్నాయని, ఒకప్పుడు టీటీడీ నిధులు అని చెప్పి ఇప్పుడు తన సొంత నిధులతో ఆలయం నిర్మాణం జరిగిందని చెబుతున్నాడని ఇందులో ఏది వాస్తవమో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడ తీసుకురాలేని అసమర్ధత ఎమ్మెల్యే ద్వారంపూడి అని ఎద్దేవా చేసారు.ఈ సమావేశంలో కాకినాడ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఎం. ఏ తాజద్దీన్, మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, గుజ్జు లక్ష్మణరావు బాబు, బంగారు సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *