fbpx

జయలక్ష్మి బ్యాంకు డిపాజిట్ దారులకు అండగా ఉంటాం : ద్వారంపూడి

Share the content

ది కాకినాడ కో ఆపరేటివ్ బ్యాంకు డిపాజిట్ దారులకు అండగా ఉంటామని కాకినాడ నగర శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మైన్ పీకే రావు, నగర బ్రాహ్మణులు కందాళ రవి, పిండిప్రోలు రాజా, రాయవరపు ప్రభాకర్, భమిడిపల్లి మూర్తి, అజ్జరపు సత్యనారాయణ మూర్తి తదితరులు శుక్రవారం గౌరవప్రదంగా ద్వారంపూడిని కలిసినప్పుడు పై వ్యాఖ్యలు చేశారు. జయలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంకుకు ఇప్పటికీ ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, ఆ తర్వాత రాబోయే ఆరు నెలల్లో వాటిని వేలం వేసి 500 కోట్లు రికవరీ చేస్తామన్నారు. ఆ డబ్బును డిపాజిట్ దారులు అందరికీ రూపాయికి రూపాయి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ బ్యాంకులో ఎక్కువగా డిపాజిట్లు చేసిన బ్రాహ్మణులు ఉన్నారని, ఈ విషయంలో ఎవరు భయవద్దని, బెంగ పడవద్దని తెలుపుతూ,నిరంతరం మేము బ్రాహ్మణ సమాజానికి అండగా ఉంటామని బ్రాహ్మణ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *