fbpx

కాంగ్రెస్ లో కోవర్ట్లుకు టిక్కెట్లు : తుమ్మలపల్లి వాసు

Share the content

కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు టికెట్లను ఇవ్వకుండా … పార్టీలు మారి వచ్చిన వారికి, పార్టీలో లేని వారికి, కోవర్టులకు ప్రకటించారని ఆ పార్టీ నేతలు తుమ్మలపల్లి వాసు, కోలా ప్రసాద్ వర్మ, లంకే ఫకీర్ రాజు (ఎల్పీ రాజు)లు ధ్వజమెత్తారు.శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకినాడలోని శాంతిని భవన్లో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…పది రోజుల క్రితం కాకినాడ పార్లమెంట్ పరిధిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కే పాండురంగారావు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారని దీనిపై తామంత అడిగితే అటువంటిదేమీలేదని మీ అందరి అభిప్రాయాలు తీసుకుని అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. చివరకి ఫేక్ అని చెప్పి దానిని ఫ్యాక్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు వ్యవస్థను తీరు వల్ల కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఢిల్లీలో పళ్లంరాజు చక్కర్లు కొడతారని స్థానికంగా పార్టీలో సమస్యల మీద వాటి పరిష్కారంపై పల్లంరాజు దృష్టి సారించరన్నారు. పల్లంరాజు తీరుపై అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లామని అక్కడ తమ గోడు వినేవారు వినకుండా అక్కడున్న వారితో తమను అడ్డగించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను అనుభవించిన పల్లంరాజుతోపాటు కొందరు నేతలు ఇతర పార్టీలపైనా, వాళ్ళ గెలుపు కోసమే ధ్యాస పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిపై మాత్రం దృష్టి సారించడంలో అశ్రద్ధ వహిస్తున్నారని మండిపడ్డారు.

కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, తుని, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రకటించిన అభ్యర్థులను మార్పు చేయాలని లేని పక్షంలో తాము సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు. కాకినాడ పార్లమెంట్ పరిధితోపాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి పళ్లంరాజు ఇష్టపడటం లేదని అందువల్ల పార్టీని నాశనం చేయాలని ఉద్దేశంతో వాళ్ళ అనుచరులకు, బంధు వర్గానికి అసెంబ్లీ టికెట్లు ఇప్పించుకున్నారని పేర్కొన్నారు. ఆయన వ్యవహరిస్తున్న తీరువల్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను వేరే పార్టీలలోకి వెళ్ళేలా పొమ్మనలేక పోయేలా పొగ పెడుతున్నారంటూ పేర్కొన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మర్రి సుజాత, వల్లూరి రామ్మోహన్, మర్రి భీమరాజు, కొల్లాబత్తుల భవాని, ఏసురత్నం, వేమగిరి జయరాజ్, వేమగిరి కాంతం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *