fbpx

“జెవీకే కిట్ల పైన అప్రమత్తత అవసరం”

Share the content

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న జగనన్న విద్యా కానుకల కిట్లపై మండల విద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సమగ్ర శిక్ష సీఎంఓ చామంతి నాగేశ్వరావు అన్నారు. శనివారం సాయంత్రం సామర్లకోట మండల విద్యాశాఖ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా చామంతి నాగేశ్వరరావు మాట్లాడుతూ జగనన్న కిట్లు ఇప్పటివరకు రోలు ప్రకారం పంపిణీ చేయగా వాటిలో అతంటికేషను అయిన డేటాను మాత్రమే తీసుకుంటామని మిగిలిన కిట్లను మండల విద్యాశాఖ కార్యాలయంలో జాగ్రత్తగా భద్రపరిచి ఉంచాలన్నారు.రాబోయే కిట్లకు ఇండెంట్ పెడతామని తెలిపారు. జిల్లాలో 1,59 794 మంది పిల్లలకు జగనన్న విద్యా కానుక పంపిణీ చేశామన్నారు.అయితే దీనిలో సామర్లకోట మండల విద్యాశాఖ కార్యాలయంకి 9,259 జేవీకే ఇచ్చామని అన్నారు. ప్రతి పాఠశాలలో జేవికే కిట్లు ప్రతి విద్యార్థి ధరించే విధంగా చూడాలని, ఏవిద్యార్థి అయినా జెవికె వస్తువులు ధరించకపోతే సంబంధిత హెడ్మాస్టర్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పి పుల్లయ్య,ఇతర సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *