fbpx

రోడ్లు ఏమో గోతులు.. ఎమ్మెల్యే నోట్లో బూతులు : పవన్ కళ్యాణ్

Share the content

రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమే…ఎంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామో ఒక్కటే ప్రశ్న అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.శనివారం గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.రాజకీయ నాయకుల బూతులు దాడులు పై ట్యాక్స్ విధిస్తే దేశంలో నిధులు కొరత ఉండదని నాని ఫాల్కివలా అన్నారు. వైసిపి నాయకుల బూతులు దాడులు పై ట్యాక్స్ విధిస్తే ఉచిత విద్య అమలు చేయవచ్చునని పేర్కొన్నారు.జగన్ ప్రభుత్వం డబల్ డి ప్రభుత్వం…ఐదేళ్లలో దాడులు దోపిడీలు తప్పా ప్రజలకు చేసింది ఏమి లేదని ధ్వజమెత్తారు. పేకాట క్లబ్బులు,ల్యాండ్ గ్రాబింగ్, దందాలు చేయటానికి ఉన్న సమయం…రోడ్లపై గుంతలు పూడ్చడానికి,ప్రజలకు రక్షిత మంచినీరు అందించడానికి మాత్రం సమయం లేదని మండిపడ్డారు.విజయవాడ నుంచి గుడివాడ రోడ్డు మధ్య చూస్తే పూర్తిగా గోతులమయం.రోడ్లు మధ్య గోతులు ఉన్నాయో? గోతులు మధ్య రోడ్లు ఉన్నాయో అన్న సందేహం కలుగుతుందని ఎద్దేవా చేశారు.రోడ్ల అధ్వానంపై గుడివాడ ఎమ్మెల్యేకు చెప్దామని అంటే బూతులు తిడుతాడు.రోడ్లు ఏమో గోతులు…ఆయన నోట్లో నుంచి వచ్చేది బూతులని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగువారి ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడుకి గౌరవం ఇవ్వలేరా ?

జగన్ తన అధికార దాహం కోసం గత ఎన్నికల్లో నందమూరి తారకరామ రావు అంటే గౌరవం ఉన్నట్లు నటించారు.తప్పని పరిస్థితుల్లో ఎన్టీఆర్ జిల్లా ప్రకటించారు. కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును తొలగించి వైయస్సార్ పేరు పెట్టవలసిన అవసరం ఏం ఉంది? తెలుగువారి ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడుకి గౌరవం ఇవ్వలేరా ? అని ప్రశ్నించారు.రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో సంక్షేమ పథకాలుకు రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన వారి పేర్లను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.రానున్న ఎన్నికల్లో గుడివాడ టిడిపి అసెంబ్లీ అభ్యర్థి వెనిగండ్ల రాము, మచిలీపట్నం జనసేన ఎంపి అభ్యర్థి బాలశౌరి ని గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *