fbpx

2019 తర్వాత వేసిన వ్యూహం ఇప్పుడు పనికొస్తోంది!

Share the content

ఒక వ్యూహం ప్రకారమే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముందు నుంచి అడుగులు వేశారా..? 2024 ఎన్నికల్లో కచ్చితంగా పొత్తు పెట్టుకుంటామని భావించే పార్టీకి సంబంధించి కీలక నియోజకవర్గాల్లో ఇన్చార్జి లను వేయలేదా..? ఓ పటిష్టమైన పద్ధతి ప్రకారమే రాజకీయం చేయడానికి ఆయన చూస్తున్నారా..? ఒకేసారి సింహాసనాన్ని అందుకోకుండా మెల్లగా మెల్లగా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారా..? ఈ అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం ఇప్పుడు కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి జనసేన బలం సరిపోదని ముందుగానే భావించిన పవన్ కళ్యాణ్ దానికి అనుగుణంగానే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత క్రియాశీలకంగా రాజకీయం చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ బిఎస్పీతో వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది. దీనిలో భాగంగా జనసేన పార్టీ 134 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. అయితే కేవలం తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మాత్రమే గెలుచుకుంది. పోటీ చేసిన రెండు చోట్ల అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. దీంతో 2019 ఎన్నికల తర్వాత ఆయన ఒక గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పార్టీని మెల్లగా విస్తరించాలని..

2019 ఎన్నికల్లో ఘోరపోవటం తర్వాత పవన్ కళ్యాణ్ కు అసలు విషయం తెలిసి వచ్చింది. ఒక బలమైన పార్టీగా జనసేన పార్టీని నిలబెట్టాలి అంటే ఒకేసారి వచ్చే ఊపు కంటే పార్టీని క్రమక్రమంగా విస్తరించాలని ఆయన ఒక వ్యూహం పన్నారు. పార్టీకి సంబంధించి కచ్చితంగా 2024 ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు నిలబెట్టేలా, అందులోనూ కొత్త వ్యక్తులను రాజకీయంలోకి తీసుకువచ్చేలా ఆయన ప్రణాళిక వేశారు. అడిగినవారికి అడిగినట్లుగా నియోజకవర్గ ఇన్చార్జిలు టికెట్లు ప్రకటించకుండా జాగ్రత్తపడ్డారు. చాలామంది నాయకులు జనసేన పార్టీలోకి రావాలని భావించినప్పటికీ వారికి నిర్దిష్టమైన హామీ లభించలేదు. దీంతో చాలామంది చివరి వరకు వచ్చి జనసేన పార్టీలో చేరకుండా వెనకడుగు వేసిన వారు ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత నాయకులకు ఆయన కేవలం ఎన్నికల కోసం పార్టీలోకి రావద్దని గట్టిగా చెప్పడం, దానికి తగినట్లుగానే ఆయన వ్యూహం పన్నడం కనిపించింది. ఆ ఫలితాలు ఆ వ్యూహం 2024లో టిడిపి తో పొత్తుకు చాలా ఉపకరించే సందర్భాలు కనిపిస్తున్నాయి.

బలంగా ఉన్నచోట సీట్లు గుర్తింపు

తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదిరితే 2019 నుంచి లేదా అంతకు ముందు నుంచి తనతో రాజకీయ ప్రయాణం చేస్తున్న వారిని ఏమాత్రం వదులుకోకూడదు అన్నది పవన్ కళ్యాణ్ నిర్ణయం. దీనికి తగినట్లుగానే అక్కడ నాయకులకు మెల్లగా సూచనలు ఇస్తూ కచ్చితంగా పొత్తులో ఉన్నా సరే పోటీ ఉంటుందని, క్షేత్రస్థాయిలో రంగం సిద్ధం చేసుకోవాలని పార్టీ నాయకుల నుంచి ఇంటర్నల్ గా సూచనలు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఏ సీట్లో అయితే జనసేన పొత్తుల భాగంగా సీటు అడుగుతుందో దానిని ముందుగానే గుర్తించి ఆయన నియోజకవర్గాల్లో కీలకమైన నేతలకు దానిని ఉప్పందిస్తున్నారు. దీంతోపాటు కచ్చితంగా జనసేన పార్టీతో ప్రయాణం చేసిన ఇన్చార్జిలను ఆయన పోగొట్టుకునే పరిస్థితిలో లేరు. కచ్చితంగా ఆయన నియోజకవర్గంలో టిడిపికి కాస్త పట్టుకున్నప్పటికీ ఆ టికెట్లను తనకు కావాలి అని గట్టిగా పట్టుబట్టి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చాలా చోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట టిడిపి అభ్యర్థులు బలంగా లేకపోవడం, అలాగే టిడిపి నాయకులు బలంగా ఉన్నచోట జనసేన ఇన్చార్జులు లేకపోవడం వంటి విషయాలు ఇప్పుడు మేలు చేసే అవకాశమే ఎక్కువ కనిపిస్తోంది. టికెట్ల ప్రకటన వేళ వీరికి ఎలాంటి సమస్య రాకుండా చాలా సులభంగా పని అయ్యేందుకు ఇది వీలు కల్పించే అవకాశం కూడా ఉంది. 2019 తర్వాత పవన్ కళ్యాణ్ విహాత్మకంగా తీసుకున్న నిర్ణయం వచ్చే ఎన్నికల్లో ఎలాంటి అరామారికులు లేకుండా ఇరు పార్టీల మధ్య సీట్లు పంపకానికి ఒక దారి చూపి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *