fbpx

సొంత చెల్లికి ఆస్తి ఇవ్వలేని వ్యక్తి…ప్రజలకు వాటాలు ఎలా పంచుతారు ?

Share the content

ముఖ్యమంత్రి వైయస్ జగన్ కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి. ఆయన తాలుకు విష,లక్షణం, సంసృతి కుటుంబాల్లో కి వెళ్ళిపోయింది. సొంత అన్నదమ్ములు కూడా తిట్టుకునేలా చేసింది. నువ్వు ఎది చూపిస్తావో అదే నికు తిరిగి వస్తుంది జగన్ . కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని జగన్ అనుకున్నారు…నేడు అదే వారి ఇంట్లో జరిగింది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. బుధవారం భీమవరం లో జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మాటి మాటికి బటన్ నొక్కుతున్నాను అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అప్పులు తెచ్చి బటన్ నొక్కడం కాదు …అభివృద్ధి చేసి బటన్ నొక్కు జగన్ అని సవాల్ విసిరారు.

తండ్రి ఆస్తిలో చెల్లికి సంపాదన ఇవ్వలేదు.సాక్షి పేపర్ లో రావాల్సిన వాటా ఇవ్వలేదు.సొంత చెల్లికి ఆస్తి ఇవ్వలేని వారు. మనకి ఎలా వాటాలు పంచుతారు అని ప్రశ్నించారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ కి ప్రస్తుత రాజకీయాల్లో స్థానం లేదని తెలిపారు.తదుపరి జరిగే 2029 ఎన్నికల్లో అయినా జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. మన దగ్గర ధైర్యం ఉంది..పోరాటం ఉంది కానీ ఎలక్షన్ హియరింగ్ చేసే సామర్థ్యం లేదు అని గుర్తు చేశారు. నాయకులుగా పోటీ చేయడం వేరు…గెలవడం వేరు..రానున్న ఎన్నికల్లో గెలవడమే ప్రామాణికం గా తీసుకున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన పొత్తులో రెండు పార్టీల నుచి ఓటు బదిలీ జరగాలని కోరారు.

సంఖ్యా బలం కులాలది ..అధికారం జగన్ రెడ్డిదా ?

రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం లో సంఖ్య పరంగా చాలా ఎక్కువ. ఐతే వీరు మధ్య సఖ్యత లేకపోవడం వల్ల నేటికీ దేహీ అనే పరిస్థితి దాపురించింది అని ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి నాలుగైదు పదవులు ఇచ్చి జగన్ అధికారం దక్కించుకున్నారని మండిపడ్డారు. అణగారిన వర్గాల సాధికారత ఎలా సాధించాలి? ఆర్థికంగా ,సామాజికంగా ఎదగడానికి ఎలాంటి పాలసీలు తీసుకురావాలని జనసేన ఆలోచిస్తుంది అని తెలిపారు.

వ్యక్తి తప్పులు… కులం మీద ప్రభావం

వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు దళిత కులానికి చెందిన కార్ డ్రైవర్ ను హత్యా చేసి డోర్ డెలివరీ చేశారు.అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వేస్తే బాస్ ఇస్ బ్యాక్ అని ఊరేగింపులు చేశారు.ముఖ్యమంత్రి సమాజానికి ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారని ప్రశ్నించారు.అనంతబాబు చర్యలతో కాపులు ..దళితులకు శత్రువులయ్యారు అని వాపోయారు.రానున్న ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.రానున్న ఎన్నికల్లో వైసిపి ఓడిపోతుంది,టిడిపి,జనసేన కూటమి గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు,పార్టీ పిఏసి సభ్యులు కనకరాజు సూరి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *