fbpx

రాష్ట్రంలో “జే ట్యాక్స్”…..పీలేరులో “పి ట్యాక్స్ ” : నాగబాబు

Share the content

శేషాచలం అడవుల్లో లభించే అరుదైన ఎర్రచందనను వైసిపి ఎమ్మెల్యేలు నరికేసి విదేశాలకు తరలిస్తున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఆరోపించారు. వైసిపి ఐదేళ్ల పాలనలో దాదాపు రూ.3000 కోట్ల విలువైన ఎర్రచందనం రాష్ట్రం నుంచి తరలిపోయింది. వ్యాపారస్తుల మీధ రాష్ట్ర వ్యాప్తంగా “జే ట్యాక్స్”. విధిస్తుంటే…పీలేరులో “పి ట్యాక్స్” విధిస్తున్నారని విమర్శించారు. పీలేరులో అధికార పార్టీ నాయకులు మైనింగ్ సంస్థల నుంచి ముక్కు పిండి నగదు వసూలు చేస్తున్నారు.మూతపడ్డ మైనింగ్ యూనిట్స్ నుంచి నెలకు రెండు లక్షలు గుంజుకుంటున్నారని ధ్వజమెత్తారు. బుధవారం పీలేరు నియోజకవర్గంలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.వైసిపి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రైతులకు మేలు చేయలేదు.నిరుద్యోగులను పట్టించుకోలేదు. వ్యాపారస్థులను వ్యాపారం చేసుకొనివ్వడం లేదు.ఫలితంగా రాష్ట్రం 25 ఏళ్లు వెనక్క వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.

పరిపాలన దక్షత లేకుండా..పూర్తిగా కక్ష పూరితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించారని మండిపడ్డారు. మోదీ గ్యారంటీ, చంద్రబాబు నాయకత్వం,పవన్ కళ్యాణ్ విశ్వాసం రాష్ట్రానికి ఎంతో అవసరమని చెప్పిన నరేంద్ర మోడీ మాటలు ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలకి భరోసా కల్గించాయి అని వివరించారు. మోదీ నాయకత్వంలో దేశం వెలిగిపోతుంది.అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు.రాష్ట్రం మాత్రం ఐదేళ్లుగా తిరోగమనంలో ఉందని ఎద్దేవా చేశారు. వైసిపి దాస్టికాలు ఆగాలన్నా, రైతులకి ,మహిళలకు భరోసా లభించలన్నా దేశంలో నరేంద్ర మోది మరోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి రాష్ట్రానికి మేలు కలగచేస్తాయని తెలిపారు.చిత్తూరు ప్రాంతం ఉద్వాన పంటలకు పెట్టింది పేరు.మదనపల్లి టమోటా కు ప్రసిద్ధి. రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో రాయలసీమలో ఫుడ్ ప్రాసెస్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. రాయలసీమ రైతులకి ఎన్డీయే ప్రభుత్వంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

హిందూ మతాన్ని అవమానిస్తున్నారు.

అయోధ్యలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ బలరాముడు ఆలయం నిర్మిస్తే….రాష్ట్రంలో శ్రీరామచంద్రుడు విగ్రహాన్ని తల నరికేశారు.గల్ఫ్ దేశాల్లో స్వామి నారాయణ మందిరం నిర్మించి భారతదేశ ధర్మాన్ని విస్తరింప చేస్తుంటే…రాష్ట్రంలో దేవతా మూర్తులు విగ్రహాల చేతులను నరికేస్తున్నారు, రథాలను తగలబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తిరుపతి శ్రీవారి దర్శనాన్ని వైకాపా ఎమ్మెల్యేలు వ్యాపారమయం చేశారని ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *