fbpx

సోషల్ మీడియాలో వేధింపుల వలనే గీతాంజలి ఆత్మహత్య : నాగమణి

Share the content

టిడిపి జనసేనల సోషల్ మీడియాలు తమ మితిమీరిన వేధింపుల వలన ఒక మహిళ ప్రాణంను పొట్టన పెట్టుకున్నాయని రాష్ట్ర సివిల్‌ సప్లై డైరెక్టర్‌ , ఉభయ గోదావరి జిల్లాల వైకాపా మహిళా విభాగ జోనల్‌ ఇన్చార్జి జమ్మలమడక నాగమణి ఆగ్రహం వ్యక్తం చేసారు. తెనాలిలో టిడిపి,జనసేన పార్టీలు చేసిన దుష్ప్రచారానికి బలైన గీతాంజలి ఆత్మహత్య ఉధంతంపై ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఇచ్చిన జగనన్న కాలనీ ఇంటి స్థలం గురించి మాట్లాడిన మహిళను మానసికంగా హింసించరన్నారు. జగనన్న ఇల్లు ఇచ్చాడని సంతోషంగా చెప్పిన గీతాంజలిదేవి అనే మహిళ పై టిడిపి, జనసేన మితిమీరన ట్రోలింగ్‌ కారణంగా మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకొచ్చారనీ ధ్వజమెత్తారు.

తెనాలి పట్టణానికి చెందిన గుల్టి గీతాంజలిదేవి(29) ఇస్లాంపేటలో గృహిణిగా నివశిస్తుంది. భర్త బాలచంద్ర బంగారం పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి పెద్ద కుమార్తె రిషిత నాల్గవ తరగతి చదువుచ ఉండగా చిన్న కుమార్తె రిషిక ఒకటో తరగతి చదువుతోంది. వీరి పెద్ద కుమార్తె రిషితకు నాలుగుసార్లు అమ్మఒడి, ఇటీవలె జగనన్న కాలనీలో ఇంటి స్థలం వచ్చింది. సొంత ఇంటి కల నెరవేర్చిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామన్నా ఆనందాన్ని ఇటీవల వైఎస్సార్సీపీ నిర్వహించిన సభలో పాల్గొన్న గీతాంజలి మీడియా ముందు తన సంతోషాన్ని వ్యక్తం చేసింది అని వివరించారు. జగనన్న పాలనలో మా లాంటి పేదోళ్ళకు సంక్షేమ పథకాలు సమృద్ధిగా అందుతున్నాయని హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భాన్ని సోషల్‌ మీడియాలో చూసిన టిడిపి, జనసేనలు ఆమెను సోషల్‌ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసారు. గీతాంజలి మాట్లాడిన మాటలను టిడిపి, జనసేన శ్రేణులు ఆమెను వక్రీకరించి సోషల్‌ మీడియాలో పెట్టడంతో భరించలేని ఆమె ఆత్మహత్యకు పాల్పడి కుటుంబాన్ని ఒంటరి చేసి తిరిగిరాని లోకాలకు తరలిపోయింది అని వాపోయారు. సామాన్యులపై దూషణలకు దిగే సోషల్‌ మాఫియాలను కోట్లు వెచ్చించి పెంచి పోషిస్తున్న తెలుగుదేశం జనసేన మాఫియాను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *