fbpx

ముగ్గురికి హ్యాండ్ ఇవ్వనన్న జగన్!

Share the content

టిడిపి నుంచి గెలిచి అతి తక్కువ కాలంలోనే వైసీపీలోకి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలు పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఏమిటి అన్నది ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. గుంటూరు పశ్చిమ స్థానం నుంచి టిడిపి తరఫున గెలిచిన మద్దాలి గిరి, గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, విశాఖ నార్త్ నుంచి గెలిచిన గణేష్ లూ వచ్చే ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేస్తారా లేక వైసీపీ అధిష్టానం వారికి ఇచ్చిన హామీ ఏమిటి అన్నది ఇప్పటికీ బయటపడడం లేదు. గన్నవరంలో వైసీపీ పార్టీలోనే ప్రధానంగా గొడవలు ఉంటే, గుంటూరు వెస్ట్ స్థానం నుంచి కూడా వచ్చే ఎన్నికల్లో గిరి పోటీ చేసేది అనుమానమే. గణేష్ కుమార్ కు కూడా వైసిపి అధిష్టానం నుంచి ఏ మాత్రం హామీ దక్కలేదు. కేవలం పార్టీలో కొనసాగుతున్నారు తప్పితే వీధి లేని పరిస్థితుల్లో మళ్ళీ వెనక్కు వెళ్లలేక అక్కడే ఉండిపోయారు అని ముగ్గురు ఎమ్మెల్యేల అనుచరులు చెబుతున్న మాట. ఏమాత్రం అవకాశం ఉన్న వెనక్కు వచ్చేయడానికి ముగ్గురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఇప్పటికే రాయ బారాలు నేరిపీనప్పటికీ లోకేష్ మాత్రం వారిని మళ్లీ పార్టీలోకి తీసుకునేందుకు ఏమాత్రం ఇష్టం చూపించలేదని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు వారు వెనకను ఈ ముందు గొయ్యి అన్నట్లు చూస్తున్నారు.

పోటాపోటీ

టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన ముగ్గురి ఎమ్మెల్యేల గ్రాఫ్ ఆయని నియోజక వర్గాల్లో అంత బాగలేదని ఇంటిలిజెన్స్ నివేదికలు వచ్చాయి. దీంతోనే వైసీపీ అధిష్టానం ఆలోచనలో పడింది. మళ్లీ ముగ్గురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా తిరుగుబాటు ఖాయమని తెలుస్తుండడంతో వైసిపి వారికి టికెట్లు కన్ఫామ్ చేయలేదు. దీనిపై పదేపదే వైసిపి అధిష్టాన పెద్దలను ఎమ్మెల్యేలు అడిగినప్పటికీ అక్కడ నుంచి ప్రతిస్పందన అంతగా బాగాలేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రిని పలుమార్లు కలిసి టికెట్ గురించి హామీ తీసుకోవాలని అనుకున్నప్పటికీ ముగ్గురికి సరైన హామీ దక్కలేదు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ విషయంలో జగన్ సానుకూలంగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితులు రాజకీయంగా అనుకూలంగా లేవు. దీంతో జగన్ కూడా ఆ పంచాయతీని తగ్గొట్టే సాహసం చేయక మౌనం వహించారు. గుంటూరు పశ్చిమ లోను గతంలో మద్దాలి గిరి చేతిలో ఓడిపోయిన యేసురత్నంకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో నువ్వు తానే పోటీలో ఉంటానని ఆయన చెప్పడం ఇప్పుడు అక్కడ అగ్గిరాజేస్తోంది. విశాఖ నార్త్ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో పరిస్థితులను తట్టుకోలేక వెంటనే వెనుక వచ్చేయాలని భావించిన అప్పటికే ద్వారాలు మూసుకుపోయాయి. దీంతో ఈ ముగ్గురు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *