fbpx

పంచాయతీలకు వరం ఇవ్వకపోతే కష్టం

Share the content

పంచాయతీ నిధులకు పూర్తిగా మంగళం పాడిన వైసిపి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో గ్రామాల వారీగా ఓట్లను సంపాదించుకోవడానికి గ్రామపంచాయతీలకు ఎలాంటి వరాలు ప్రకటిస్తుంది వారిని మళ్లీ ఎలా తమ వైపు తిప్పుకుంటుంది అన్నది వేచి చూడాలి. 14,15వ ఆర్థిక సంఘం నిధులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు కేటాయించలేదు. కరెంట్ బిల్లులు పేరుతో నిధులను ప్రభుత్వమే మళ్ళీ తీసుకుంది. కరెంట్ బిల్లులు పెండింగ్ ఉండిపోవడంతో 14, 15 ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు మళ్ళించకుండా కరెంట్ బిల్లుల సర్దుబాటు పేరుతో ప్రభుత్వమే తన ఖాతాలో వేసుకోవడంతో పంచాయతీలకు కనీస నిర్వహణకు నిధులు లేకుండా పోయాయి.

పంచాయితీలను పూర్తిగా పక్కన పెట్టేసారు.

మరోపక్క వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సచివాలయాల వ్యవస్థ వాలంటీర్లు వ్యవస్థతో పంచాయతీల్లో పూర్తిగా సర్పంచులకు ఇతర ప్రజాప్రతినిధులకు పని లేకుండా పోయింది. వారి అధికారాలను ప్రశ్నిస్తూ క్షేత్రస్థాయిలో వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ పనిచేస్తుండడంతో వీరి వద్దకు వచ్చే ప్రజలే లేకపోవడంతో అధికారం ఉన్నా లేకున్నా ఒకటే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. దీనికి తోడు కనీస నిధులు లేకపోవడంతో పంచాయతీలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. రాష్ట్రంలో ఉన్న 13వేల పంచాయితీల్లో మెజారిటీ భాగం పంచాయతీలు వైసీపీ గెలుచుకున్నవే. తమ ప్రభుత్వం వస్తే ఏదో జరుగుతుంది అని ఆశపడిన క్షేత్రస్థాయి నాయకులు పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సరే ఏమి ప్రయోజనం లేకపోవడంతో ఇప్పుడు వైసీపీ అధిష్టానం మీద జగన్ తీరు మీద చాలా కోపంతో ఉన్నారు. తమకు ఇవ్వాల్సిన నిధులను సైతం ఇవ్వకుండా వైసిపి ప్రభుత్వం ముప్పు తిప్పులు పెడుతోంది అని బహిరంగంగా వైసీపీ సర్పంచులే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు గ్రామస్థాయిలో పరువు పోతుందనే భయంతో ఏమీ చేయలేక మిన్నకుండి పోతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో కోపంగా ఉన్న సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులను వైసీపీ అధిష్టానం ఏ మేరకు చల్లబరుస్తుంది వారికి ఏ మేరకు హామీ ఇస్తుంది అన్నది కీలకంగా మారనుంది. తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రయత్నిస్తే దృష్టి పెడితే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలోని సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులు పార్టీలు మారే అవకాశం కూడా ఉంది. అయితే జగన్ ఎన్నికల ముందు ఏదో ఒక వరం ప్రకటిస్తారని కచ్చితంగా సర్పంచులు, గ్రామస్థాయి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ఏదో ఒకటి చేస్తారు అని ఇప్పటికీ బలంగా నమ్మకం అయితే కనిపిస్తోంది. ఇదే పందాలు ముందుకు వెళ్లి ఎన్నికలకు వెళ్తే కనుక జగన్ కు పంచాయతీలు క్షేత్రస్థాయిలో పెద్ద దెబ్బ పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైనా ఎన్నికల ముందు ప్రత్యేక వరం కనుక ప్రకటిస్తే మీరు కచ్చితంగా మళ్ళీ వైసీపీ అధికారంలో రావడానికి పని చేస్తారు అనడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *