fbpx

ముందస్తు ఎన్నికలు లేనట్టేనా…?

Share the content

జూన్ 7వ తేదీన ఏదో జరుగుతుందని కచ్చితంగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుందని విపక్ష మీడియాలో అలాగే విపక్ష వాట్స్అప్ గ్రూపుల్లో విపరీతంగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఏడవ తేదీన జరిగే క్యాబినెట్ భేటీలో కీలకమైన నిర్ణయం ఉంటుందని కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాన్ని జగన్ ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే జూన్ 7వ తేదీ.. క్యాబినెట్ భేటీ కూడా జరిగింది. అయితే కీలక నిర్ణయాలు వచ్చాయి తప్పితే ప్రభుత్వం రద్దుకు సంబంధించి ఎలాంటి నిర్ణయము రాలేదు. దీంతోపాటు ముఖ్యమంత్రి వైయస్ జగన్ కచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు రావని కుండబద్దలు కొట్టారు. దీంతో జూన్ 7వ తేదీన చాలా పెద్ద విషయం బయటకు రాబోతుందని రాజకీయ సర్కిల్లో జరిగిన ప్రచారం పూర్తిగా అవాస్తవంగా మారింది.

ఐనా ఎక్కడో సందేహం

ముఖ్యమంత్రి స్వయంగా ముందస్తు ఎన్నికలు ఉండవు అని చెప్పినప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం దీనికి భిన్నమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు ఇప్పుడు వాటిని మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఉద్యోగులు మొదటి నుంచి పోరాడుతున్న సిపిఎస్ ను పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేయడం ఇది కీలక పరిణామం. అలాగే సుమారుగా 10,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను సైతం రెగ్యులరైజ్ చేస్తామని క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం కూడా చాలా కీలకమైన అంశం. ఒకేసారి 10000 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం అంటే చాలా సాధారణ విషయం కాదు. దీంతో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయాలు కచ్చితంగా ఎన్నికల ప్రణాళికకు సంబంధించిన నిర్ణయాలే అన్నది రాజకీయ పార్టీలు చేస్తున్న పోస్ట్ మార్టం. ఇప్పుడు సడన్గా కీలకమైన అంశాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి చేశామని చెప్పుకోవడానికి చేస్తున్నా కీలకమైన ప్రతి చర్యలుగానే ఉన్నాయి. దీంతో కచ్చితంగా వైసీపీ ప్రభుత్వం త్వరలోనే ప్రభుత్వం రద్దుచేసి ఎన్నికలకు ఏ నిమిషంలో అయినా ముందుకు వెళ్లే అవకాశం లేకపోలేదు అని తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని బట్టి ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్ట సాధ్యమని, అయితే జగన్ తీసుకున్న నిర్ణయం కచ్చితంగా ఎన్నికలకు వెళ్లే వ్యూహంలో భాగంగానే తీసుకున్నారు అన్నది కూడా బలంగా జరుగుతోంది. అయితే బుధవారం జరిగిన క్యాబినెట్ బేటిలో మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని చెప్పడం కొస మెరుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *