fbpx

తల్లి తండ్రులకు పూర్తి ఆర్థిక భరోసాగా విదేశీ విద్యా దీవెన

Share the content

జగనన్న విదేశీ విద్యా దీవెన,సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల నిధులను సిఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు.పూర్తి పారదర్శకతతో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్మును జమ చేశారు.బుధవారం సిఎం క్యాంపు కార్యాలయంలో వర్చువల్‌గా బటన్‌ నొక్కి మొత్తాన్ని విడుదల చేశారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.60 కోట్లను, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మంది విద్యార్థులకు, మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు 100.50 లక్షల లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ .. విదేశీ విద్యను ఆశించే వారి తల్లిదండ్రులు అప్పుల ఊబిలో పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.సివిల్ సర్వీసెస్ ఇన్సెంటివ్‌ను మొదటిసారిగా విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ రెండు కార్యక్రమాలు ద్వారా వారి కలలను నెరవేర్చడంలో ప్రభుత్వ మద్దతు ఉంటుందని తెలిపారు. ఆశావహులకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చే ప్రత్యేక లక్షణం ఈ పథకాలకు ఉందని అన్నారు. అమెరికాలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అడ్మిషన్ పొందిన 51 మంది విద్యార్థులకు ఫీజు కోసం 9.5 కోట్లు విడుదల చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు విదేశీ విద్యను అభ్యసిస్తున్న 408 మంది విద్యార్థులకు 107 కోట్లు చెల్లించింది అని పేర్కొన్నారు.

* వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఈబీసీ విద్యార్థులందరికీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తోంది అని పేర్కొన్నారు.ఈ పథకాన్ని సంతృప్త పద్ధతిలో అమలు చేయడం ద్వారా, లబ్ధిదారులు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు.ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిన వారు భవిష్యత్తులో రాష్ట్రానికి ఎంతో సహాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.లక్ష బకాయిలు కూడా చెల్లించకుండా గత టిడిపి ప్రభుత్వం 3,326 మంది విద్యార్థులను పక్కదారి పట్టించనదని విమర్శించారు.
క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో జాబితా చేయబడిన విదేశాల్లోని 50 విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న 350 విద్యా సంస్థల్లోని 21 విభిన్న ఫ్యాకల్టీలలో ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1.25 కోట్లు,ఈబీసీ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1కోటి వరకు అందజేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎం. నాగార్జున, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి (సాంఘిక సంక్షేమం) జి. జయలక్ష్మి, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.ఎం. ఇంతియాజ్, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ విజయ కృష్ణన్, ఎప్హేచ్సిసి చైర్మన్ కె. హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *