fbpx

జగనన్న సైన్యమా? జగనన్న ధనాగారమా ? : నాదెండ్ల మనోహర్

Share the content

రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు సంవత్సరానికి ఖర్చు చేస్తున్న రూ. 1500 కోట్లల్లో రూ.617 కోట్లును దారి మళ్లించారని జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. సోమవారం తెనాలి లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….వైసిపి ప్రభుత్వం నియమించిన 2,65,380 మంది వాలంటీర్లలో 1,02,836 మంది వాలంటీర్లు సమాచారం నమోదు కాలేదన్నారు. ఆ వాలంటీర్లు ఎవరికి నివేదికలు ఇస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై సమగ్రమైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు..క్షేత్ర స్థాయిలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పుకోవడం కోసం నిరుద్యోగులకు ఐదువేల రూపాయలు ఇస్తూ దగా కి పాల్పడి మోసం చేసారని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీను ఏర్పాటు చేసి, ప్రభుత్వంలో ఉన్న అధికారికి సంబంధం లేకుండా 1500 కోట్ల రూపాయలు గ్రామ ,వార్డ్ సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ కోసం ఈ ఏజెన్సీ ద్వారా నడిపిస్తున్నారు అని తెలిపారు. ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ కి సంవత్సరానికి రూ 15 కోట్ల రూపాయలు శిక్షణ కోసం ఖర్చు చేస్తున్నారని వెల్లడించారు.

దోపిడీ చేసిన వ్యవస్థ ఎఫ్.ఓ.ఏ ఏజెన్సీ ఎక్కడ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వాలంటీర్లు కోసం రూ.1560 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని ప్రొవిజన్ పెట్టారా ? వాలంటీర్లు కి ఖర్చు చేస్తున్న రూ. 1560 కోట్ల రూపాయల్లో 617 కోట్ల రూపాయలు ఎవరి చేతులోకి పోతున్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర యువత ఉద్యోగ అవకాశాల కోసం 7,92,347 మంది ఐదువేల జీతం వచ్చే వాలంటీర్లు కోసం ధరకాస్తు చేసుకొనే పరిస్థితికి తీసుకువచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య గురుంచి ముఖ్యమంత్రి ఎప్పుడైనా మాట్లాడారా? నిరుద్యోగ యువతని ఎందుకు మోసం చేస్తున్నారని ప్రశ్నించారు.

వాలంటీర్ల పై వ్యక్తిగత దురుద్దేశం లేదు.

వాలంటీర్లు వ్యవస్థ దుర్వినియోగం పై పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలను జాగ్రత్తగా ఆలోచించాలని వాలంటీర్లకు విజ్ఞప్తి చేశారు. వాలంటీర్లు ను జగన్ మోహన్ రెడ్డి స్టార్ట్ కాంపెయిన్ ర్ లాగా వాడుకంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తికి లబ్ధి కలగటం కొసం ఎందుకు ఇంత సైన్యం తయారు చేస్తున్నారు..ఇది ప్రజాస్వామ్య బద్ధమా? అని ప్రశ్నించారు. చట్టంలో మార్పు తీసుకురాకుండా వాలంటీర్లు ని అగౌరవపరిచినట్టు కాదా అని ప్రశ్నించారు. వాలంటీర్లు ముఖ్యమంత్రి ని నమ్మారు..కానీ జగన్మోహన్ రెడ్డి వారిని మోసం చేశారని ఎద్దేవా చేశారు. రాబోయే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో దారి మళ్ళిన రూ.617 కోట్ల రూపాయలను ఎవరి చేతుల్లోకి వెళ్లాయి అనేది రుజువు చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *