fbpx

ప్రజా ఆశీర్వాద యాత్రకు జగన్ రెఢీ.

Share the content

సమయం దగ్గర పడుతున్న కొద్ది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్ళీ తన ఎన్నికల వ్యూహలకు పదును పెడుతున్నారు. పూర్తిస్థాయిలో జనంలో ఉండేలా ప్రణాళిక వేస్తున్నారు. దసరా తర్వాత పాలన మొత్తం విశాఖపట్నం తరలి వెళ్ళిపోతే అప్పట్నుంచి జనంలో ఉండేందుకు పక్కాగా ప్రణాళిక రచిస్తున్నారు. ప్రజా ఆశీర్వాద యాత్ర ద్వారా మళ్ళీ బలంగా ప్రజల్లోకి వెళ్లి… చేసిన సంక్షేమాన్ని చెప్పడంతో పాటు జిల్లాల వారీగా పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు.

** వైయస్ జగన్ ఎన్నికల టూర్ను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చేసిన సంక్షేమం గుర్తుపెట్టుకొని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆశీర్వదించాలి అనే నినాదంతో ఆయన ప్రజా ఆశీర్వాద యాత్ర చేయనున్నారు. ప్రతి జిల్లాలోనూ యాత్రతోపాటు పార్టీ కార్యకర్తలను కలుసుకొని మరింత బూస్ట్ ఇచ్చేలాగా ఆయన చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమయత్వం చేయడంతో పాటు ఇప్పటివరకు వైఎస్ జగన్ ప్రజల్లో తిరగలేదు అన్న భావనను తొలగించేలా ఆయన టూర్ రూపొందించనున్నారు. నియోజకవర్గాల్లో అక్కడికక్కడే అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించి పార్టీ కార్యకర్తలు పనిచేయాలని చెప్పనున్నారు. వచ్చే ఎన్నికలు వైసిపికి ఎంత కీలకం అనేది చెప్పడంతో పాటు ప్రజలు కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి నిలబడాలి అని కోరనున్నారు. ఇది బస్సు యాత్ర ద్వారా సాగుతుందా లేక మరే ఇతర పద్ధతి అయిన జగన్ అవలంబించనున్నారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో కేడర్లో జోష్ నింపి పూర్తిస్థాయిలో ఎన్నికలకు సమాచారం చేయాలంటే జగన్ కచ్చితంగా ప్రజల్లోకి వస్తేనే బాగుంటుంది అన్న సూచన మేరకు ఈ యాత్రకు త్వరలోనే ఆయన శ్రీకారం చుట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *