fbpx

తెలుగుదేశం బతికితే బిజెపికి కష్టం!

Share the content

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటినుంచో ప్రేక్షకు పాత్రకు పరిమితమైన భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మరల్చుచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీతో పాటు ప్రయాణం చేయాలని భావించిన భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా మారుతున్న రాజకీయ పరిణామాలను బిజెపికి అనుకూలంగా చేసుకోవాలని రాష్ట్రంలో స్థిరమైన పార్టీగా ఏర్పడాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టిడిపి తో కలిసి వెళ్తామని చెబుతున్న జనసేన ను తనకు అనుకూలంగా ప్రస్తుతం వాడుకోవడం తోపాటు తెలుగుదేశం పార్టీ కనుక అదృశ్యం అయితే కచ్చితంగా ఆ లోటును బిజెపి తీర్చాలని భావిస్తోంది.

చంద్రబాబు అరెస్టు సమయంలో బిజెపి నేతల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. చంద్రబాబుకు అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ప్రకటన రాకుండా బిజెపి నాయకులంతా జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా కేంద్ర పెద్దల నుంచి రాష్ట్ర నేతలకు దీనిపై బలమైన ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టును ఖండించాల్సిన అవసరం ఏమీ లేదని కేంద్ర బీజేపీ పెద్దలు రాష్ట్ర నేతలతో గట్టిగా చెప్పడంతోనే చంద్రబాబు అనుకూలంగా ఉన్న బిజెపి నేతలు సైతం సైలెంట్ గా ఉండిపోయారు. సమీప భవిష్యత్తులో లోకేష్ అరెస్ట్ కూడా ఉంటుందని వార్తల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే శక్తి పూర్తిగా కోల్పోతే ఆ పాత్రను కచ్చితంగా జనసేన బిజెపి కూటమి తీసుకోవాలని భావిస్తోంది. గతంలో అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అయిన సందర్భంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలగజేసుకోవద్దని కోరారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రతిస్పందిస్తూ ఇప్పట్లో తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమీ లేదని చెప్పడంతో ఇప్పుడు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం ప్రత్యామ్నాయంగా బిజెపి జనసేన కూటమి వ్యవహరించాలని బిజెపి ఆలోచన. 2029 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో పూర్తిస్థాయి బలం పుంజుకోవాలి అని బిజెపి భావిస్తోంది. కచ్చితంగా చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ కనుక కనుమరుగు అయితే ఆ పార్టీలోని చాలామంది నేతలు బిజెపిలో చేరుతారని అంచనా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పార్టీని బతికిస్తే అది పూర్తిగా బిజెపికి మైనస్ అవుతుందని దీంతోనే ఆచితూచి వెళ్లాలని పవన్ కు చెబుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జగన్ గెలవకూడదని భావిస్తున్న పవన్.. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీని కలుపుకు వెళ్లాలని భావించిన ప్రస్తుతం ఎక్కడో స్వరం మారుతున్నట్లుగా సమాచారం. 2029 ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకోవాలని బిజెపి కేంద్ర పెద్దలు ఇప్పటికే పవన్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్లేస్ లోకి రావడం ద్వారా మాత్రమే జగన్కు ధీటుగా ఎదుర్కొనే శక్తిగా ఎదగగలమని భావిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ కీలక సమయంలో అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చాలా ఉత్కంఠను కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *