fbpx

పవన్ కు నిజంగానే ప్రాణహాని ఉందా??

Share the content

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు నిజంగానే ప్రాణహాని ఉందా..? కరెక్ట్ గా ఎన్నికల సమయానికి ఆయన ఈ విషయాన్ని ఎందుకు ప్రతిసారి పైకి చెబుతున్నారు..?? గతంలోనూ ఆయన ఇదే మాటలు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పారు. మరోసారి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనకు ప్రాణహాని ఉంది అని చెప్పడం ద్వారా ఆయన నిజం చెప్పాలనుకుంటున్నారా లేక ఆయనకు తెలిసిన సమాచారాన్ని ప్రభుత్వం వద్దకు పంపి ఎలెర్ట్ చేయాలని భావిస్తున్నారా..? లేక రాజకీయంగా వాడుకోవడానికి ఈ ఆరోపణలు చేస్తున్నారా అన్నది గమనించాల్సిన విషయం. కచ్చితంగా పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని తల పెడితే వచ్చే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో దారుణంగా ఉండే పరిస్థితి ఉంది. అది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. మరి ఇలాంటి సమయంలో ఆయనకు ఎవరు ప్రాణహాని తలపెడతారు?? అది ఏ మార్గంలో ఉంటుంది అన్నది కీలకం.

పక్కా సమాచారం..!!

పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తులతో మాట్లాడుతుంటారు. ఇంటర్నల్ సమాచారం కూడా ఆయన వద్ద ఉంటుంది. దీంతోపాటు ఆయనకు ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఎలాంటి అవినీతి మరకలు లేకపోవడంతో పాటు నిజాయితీగల నాయకుడు అని జనంలో పేరు ఉంది. చాలామంది సివిల్స్ అధికారులు కూడా ఆయన స్నేహితులు సన్నిహితులు ఉన్నారు. ఎప్పటికప్పుడు వచ్చే సమాచారం వేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రాణహాని ఉందని ఇప్పుడు చెప్పడం దీంతోపాటు భద్రత నియమాలను ప్రోటోకాల్ ను నాయకులు కూడా పాటించాలని హెచ్చరించడం చూస్తుంటే ఆయనకు కీలక సమాచారం ఏదో అందిందని భావించాలి. గతంలో ఉన్న వ్యక్తిగత సిబ్బందిని సైతం పవన్ కళ్యాణ్ భారీగా పెంచారు. గతంలో చాలా సాధారణంగా ఉండే వ్యక్తిగత భద్రతా సిబ్బందిని మూడోంతులు పెంచారు. దీంతోపాటు పవన్ కళ్యాణ్ పర్యటించే ప్రతి ప్రదేశంలోనూ ఖచ్చితంగా తనిఖీలు ఉంటున్నాయి. కొత్త వ్యక్తుల రాకను గమనించేందుకు భారీగా ప్రైవేట్ సైన్యం కూడా పనిచేస్తుంది. జనంలోకి వచ్చే సమయంలో పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయనకు ప్రాణహాని ఉందని బలంగా నమ్మడంతోనే, వారాహిలాంటి అతిపెద్ద వాహనాన్ని సొంతంగా తయారు చేయించుకున్నారు. ఇటీవల హైదరాబాదులోని సొంత ఇంటి వద్ద కూడా కొందరు అనుమానాస్పదంగా తిరగడం, హైదరాబాద్ పోలీసులకు సమాచారం చేరవేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కదలికలను ఒక ప్రత్యేక సుపారి గ్యాంగ్ గమనిస్తుందని తెలుస్తోంది. ఈ కారణంతోనే ఆయన ప్రభుత్వ తీరును తప్పుపడుతూ దీని వెనుక ఉన్న పెద్దల గురించి చెప్పి రాజకీయ అంశం చేయడానికి పూనుకున్నారు. అయితే దీనిని జనసైనికులు ఎలా తీసుకుంటారు.. అధికార పార్టీ ఎలా స్పందిస్తుంది అన్నది కూడా కీలకమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *