fbpx

తెలంగాణలో జనసేనకు తెలుగుదేశం మద్దతు ఇస్తే..??

Share the content

తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైఖరి ఇప్పుడు కీలకం కానుంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చి చెప్పిన తెలుగుదేశం పార్టీ తటస్థంగా ఉంటుందా లేక ఏ పార్టీకైనా మద్దతు ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీతో జత కట్టిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లోను జనసేన పార్టీకి మద్దతుగా నిలిచి.. ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపుకు తెలుగుదేశం పార్టీ సహకరించాలని కోరితే కనుక అది కచ్చితంగా మంచి సంకేతాలు అందించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ కనుక జనసేన పార్టీకి తెలంగాణ ఎన్నికల్లో మద్దతు ఇస్తే కనుక ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సుహృద్భావ వాతావరణాన్ని రెండు పార్టీల్లోను తెస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకీ అనుకూలంగానే మారుతుంది.

** తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తాము పోటీ చేయడం లేదని తేల్చి చెప్పింది. దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సైతం పార్టీ మారిపోయారు. కెసిఆర్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఏమాత్రం తేల్చకుండా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాజకీయం చేసేందుకే చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండిపోయారని ఇప్పటికే రాజకీయ వర్గాల విశ్లేషిస్తున్నాయి. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తో చంద్రబాబుకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని చంద్రబాబు బినామీగా ఇప్పటికీ భావిస్తారు. దీంతోపాటు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా చంద్రబాబు సహకరించారు అని బిజెపి పెద్దలు ఇప్పటికీ అనుమానిస్తున్నారు. ఇవన్నీ కలగలిపితే బిజెపికి వ్యతిరేకంగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నట్లు అనిపిస్తోంది. అదే సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బిజెపికి బాగా దగ్గరగా ఉన్నారు. బిజెపి కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు ఉండడంతో పాటు బిజెపితో తెలంగాణలో కలిసి వెళ్తామని ఇప్పటికే ప్రకటించారు. జనసేన పార్టీకి సుమారు 8 నుంచి 10 స్థానాలు వరకు బిజెపి ఇచ్చే అవకాశం ఉంది. సెటిలర్స్ కి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అలాగే ఆంధ్రప్రదేశ్కు దగ్గరగా ఉన్న ఖమ్మం లాంటి ప్రాంతాల్లో సీట్లు ఎక్కువగా రాబట్టుకొవచ్చు . తెలంగాణలో జనసేన పార్టీకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కనుక మద్దతు తెలిపితే సెటిలర్ల ఓట్లు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి దగ్గరగా ఉండే ఖమ్మం, కోదాడ, సూర్యాపేట, అశ్వరావుపేట, సత్తుపల్లి, మణుగూరు, భద్రాచలం, హైదరాబాద్ నగరంలో మూడు ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి సేటిల్లర్ల మద్దతు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వెళ్లిన ప్రజల మద్దతు ఎక్కువగా ఉంటుంది. దీంతో బహిరంగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి తెలంగాణ ఎన్నికల్లో మద్దతు తెలిపితే కనుక అది కచ్చితంగా అక్కడ ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అది రెండు పార్టీల పొత్తు ను మరింత ఆరోగ్యకరంగా తయారు చేసే అవకాశం కూడా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది… దీనిపై పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఏమైనా మద్దతు కోరుతారా దీనిని బిజెపి ఎలా స్వీకరిస్తుంది అన్నది ఇప్పుడు అక్కడ కాక రేపుతోంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *