fbpx

పవన్ పాస్ అయితే వైసీపీ ఓటమి తప్పదు!

Share the content

పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద వారి సేవలు మీద చేస్తున్న వ్యాఖ్యలను సమర్ధంగా తిప్పి కొట్టడానికి వైసీపీకి సరైన ఆయుధం దొరకడం లేదు. ఆయన వ్యక్తిగత విషయాలు మీదనే మళ్లీ మలుతున్నారు తప్పితే పవన్ కు సరైన ధీటైన సమాధానం ఇవ్వడంలో వైసీపీ వెనకబడుతోంది. నిన్న మొన్నటి వరకు వాలంటీర్లను దేవుళ్ళుగా చూసిన ప్రజలు ఇప్పుడు అనుమానించడం కూడా మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తీవ్రవరూపం దాల్చి ప్రజల్లోకి వెళ్లడంతో అవి ఎంత మేర ప్రజల్ని ప్రభావితం చేస్తాయి అని వైసిపి ఇప్పుడిప్పుడే ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెప్పించుకుంటుంది. మరోపక్క పవన్ వ్యాఖ్యలకు జతగా తెలుగుదేశం పార్టీ కూడా జత కావడంతో ఇప్పుడు ఈ అంశం మరింత వేడెక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఎం చేయాలో చెప్పాలో అర్ధం కాక??

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పూర్తిస్థాయిలో ఖండించడం వరకు బాగానే ఉన్నప్పటికీ అక్కడ కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తుండడంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు కూడా పవన్ కు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ బహిరంగ సభలో నేను పాలసీల మీద మాత్రమే మాట్లాడుతాను అని స్పష్టం చేశారు. కాగ్ లెక్కల దగ్గర నుంచి బడ్జెట్ లెక్కలు కూడా బహిరంగంగా చెబుతూ పాలసీల మీద మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పుకోలేక వైసీపీ సతమతం అవుతోంది. వాలంటీర్ల విషయంలోనూ వైసీపీ బయటపడి వాలంటీర్లు తమ వారే అన్నట్లుగా మాట్లాడడం చూస్తుంటే కచ్చితంగా వైసీపీ వాలంటీర్లును పెంచి పోషిస్తుంది అని ప్రజలు నమ్మే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రక్షణాత్మక ధోరణి అవలంబించే విషయంలోనే వైసీపీ ఎక్కడో తడబడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వాలంటీర్లు ప్రజా సేవకులు అని చెప్పడానికి వైసీపీ నాయకులు ఎందుకో తడబడుతున్నారు. ఎప్పుడు వచ్చినవారే టీవీలో కనిపిస్తూ ప్రెస్ మీట్ లు పెట్టి పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా తిట్టడం వల్ల ప్రజలు వైసీపీని మరింత చిత్కరించుకునే అవకాశం కనిపిస్తోంది. పగడ్బందీ ప్రణాళికతో వాలంటీర్ల విషయాన్ని వైసిపి ఎదుర్కోకపోతే ప్రజల్లో ఇది కొత్త సందేహాలకు బీజం వేస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో వైసీపీ నష్టపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పాస్ అయితే మాత్రం వైసీపీ వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడం దాదాపు కష్టమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *