fbpx

బెజవాడ రాజకీయ కాక

Share the content

బెజవాడ వైపు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మరోసారి దృష్టి మళ్లేలా చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు, ఆయన చేస్తున్న పనులు కూడా రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ మీద అలకతో ఉన్న కేశినేని నాని కచ్చితంగా వచ్చే ఎన్నికలనాటికి పార్టీ మారతారు అన్న ఊహాగానాలు ఇప్పుడు మరీ ఎక్కువయ్యాయి. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా అయిన బరిలోకి దిగుతాను అని చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికల్లో టిడిపి కచ్చితంగా కేశినేని నాని కి టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని ఆయనే చెప్పకనే చెప్పారు. అయితే వచ్చి ఎన్నికల నాటికి ఆయన రాజకీయ ప్రయాణం ఎటువైపు ఉంటుంది అన్నది మాత్రం స్పష్టత లేదు.

చిన్నికి ప్రాధాన్యత

2019 ఎన్నికల్లో కేశినేని నాని విజయవాడ నుంచి గెలిచిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి అంటి ముట్టినట్లుగానే వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం స్వతంత్రంగా ఆయన పనులు చేసుకోవడం ఎక్కువైంది. సొంత ఇమేజ్ పెంచుకోవడానికి కేశినేని నాని తీవ్రంగా ప్రయత్నించారు. మరోవైపు పార్టీ సమావేశాలకు అలాగే అధినేత చంద్రబాబు మాటలకు కూడా ఆయన ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకుండా గడిపారు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో ఆయనకు ఉన్న విభేదాలు బహిరంగంగా కనిపించాయి. కేశినేని నాని కూతురు శ్వేతకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించడం ద్వారా ఆమె తెలుగుదేశం పార్టీ తరఫున టిడిపి తరఫున మేయర్ అభ్యర్థి అని కేశినేని నాని స్వయంగా ప్రకటించారు. దీనిపై టిడిపి నాయకులే కేశినేని నాని తీరును తప్పు పట్టారు. ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారు అంటూ ప్రశ్నించారు. ఇది అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. తర్వాత శ్వేతను కేవలం అభ్యర్థిగా మాత్రమే ప్రకటించి మేయర్ అభ్యర్థిగా తర్వాత పార్టీ ఎవరు చెబితే వారు ఉంటారని టిడిపి అధిష్టానం చెప్పింది. ఈ పరిణామంతో టిడిపి పెద్దలకు కేశినేని నానికి మధ్య తీవ్ర అంతరాలు మొదలయ్యాయి. దీంతో అధినేత చంద్రబాబు నాయుడు కేశినేని నాని తమ్ముడు చిన్నిని ప్రోత్సహించడం . చిన్ని కూడా రాజకీయాల పట్ల సానుకూలత వ్యక్తం చేయడంతో చిన్ని కు పూర్తి ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కార్యక్రమాలను అప్పజెప్పడం మొదలుపెట్టారు.

నేతలతో తీవ్ర స్పర్ధలు

కేశినేని నానికి మొదటి నుంచి సొంత పార్టీ నేతలతోనే సమస్యలు ఎక్కువ. మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా తో ఆయనకు మొదటినుంచి పడదు. బహిరంగం గానే దేవినేని ఉమ తీరును చేసిన నాని విమర్శించేవారు. స్థానిక సంస్థలు ఎన్నికల తర్వాత బోండా ఉమ, బుద్ధ వెంకన్న తోను కేశినేని నానికి పూర్తిగా చెడింది. దీంతో కేసినేని నానికి తెలుగుదేశం పార్టీలో మద్దతు ఇచ్చేవారు కరువయ్యారు. మరోవైపు చిన్నికి పూర్తిగా పార్టీ ప్రాధాన్యమిస్తుండడంతో ఆయనను ప్రోత్సహించేవారు ఎక్కువయ్యారు. దీంతో కేసినేని నాని రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తారు అన్నది కీలకం కానుంది. ఇప్పటికే వైసీపీ కీలక నేత అయోధ్యరామిరెడ్డి కేశినేని నాని వస్తాను అంటే కచ్చితంగా పార్టీలోకి తీసుకుంటామని చెప్పారు. మరోపక్క కేసినేని నాని సైతం వైసీపీ ఎమ్మెల్యేల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి కేశినేని నానిని ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ప్రకటిస్తుందా అనే అనుమానం కలుగుతుంది. ఒకవేళ కేసిన నాని వైసీపీ అభ్యర్థి అయితే ఆయన సొంత బలం కూడా పనికి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే రెండుసార్లు వరుసగా గెలిచిన నాని మూడోసారి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు విజయవాడ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయి అనేది ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *