fbpx

పేరుకే పదవి పెత్తనం అంతా ఆయనదే…

Share the content

కొని పరిస్థితిలో టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చి చివిరి నిమిషంలో కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిచారు తానేటి వనిత. గతంలో గోపాలపురం నుంచి గెలిచిన వనితకు కొవ్వూరు నియోజకవర్గం పూర్తిగా కొత్త. అయితే జగన్ గాలిలో ఆమె మంచి విజయాన్ని అక్కడ దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలోను కీలకమైన హోం మంత్రిగా బాధ్యతలు ఆమెకు అదృష్టంగా వరించాయి. అయితే వనిత హోం మంత్రిగా తన బాధ్యతలను చూసుకోవడం కంటే కొవ్వూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు పైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రం మొత్తం మీద కీలకమైన శాంతిభద్రతల పర్యవేక్షణకు సంబంధించిన బాధ్యతలు ఉన్నప్పటికీ ఆమె దానికంటే నియోజకవర్గంలో తిరగడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు.

ఆమె డమ్మీనేనా?

ఇటీవల వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని ఇంటిలిజెంట్ సమాచారం అందడంతో అప్పటికప్పుడు ముఖ్యమంత్రి జగన్ డీజీపీతోను అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి తోనూ కీలకంగా సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హోం మంత్రి లేకపోవడం విశేషం. రాష్ట్రంలో అవినాష్ రెడ్డి అరెస్టు జరిగితే శాంతి భద్రతల సమస్య ఏమైనా వస్తుందా లేక పార్టీ పరిస్థితి ఏమిటి అన్నది ఇక్కడ ముఖ్యమంత్రి చర్చించిన దానిలో హోం మంత్రి ప్రమేయం లేకపోవడం వనిత బాధ్యతల తీరును తెలియజేపుతోంది. కేవలం వైసీపీలో సకల శాఖ మంత్రిగా పేరుపొందిన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లే మొత్తం జరుగుతుంది అని కేవలం హోం మంత్రిగా తన వద్దకు వచ్చిన ఫైల్స్ను పరిశీలించి సంతకం పెట్టే వరకే వనిత బాధ్యత అనేది వైసిపి లోనే జరుగుతున్న అంతర్గత చర్చ. పై రూపంలో పేరుకు మాత్రమే హోం మంత్రి గాని మొత్తం నడిపించేది సజ్జన రామకృష్ణారెడ్డి అన్నది ఆ పార్టీ నేతలే చెబుతున్న మాట. దీనికి తగినట్లుగానే వనిత కూడా నడుచుకుంటున్నారు. కీలకమైన సమీక్షలు లేవు… శాంతిభద్రతలపై సమావేశాలు అసలు నిర్వహించిన దాఖలాలు లేవు. కేవలం తూతూ మంత్రపు హోం మంత్రి గానే ఆమె పని చేస్తున్నారు అన్న విమర్శలు ఎక్కువ వినిపిస్తున్నాయి.

మాట్లాడితే వివాదం

హోం మంత్రి వంటి కీలకమైన హోదాలో ఉన్న వనిత ఒక్కోసారి మాట్లాడుతున్న మాటలు తీవ్రవివాదం అవుతున్నాయి. మహిళ మీద అత్యాచారం జరిగిన ఘటనలో ఆమె మాట్లాడిన మాటలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంసమయ్యాయి. దీంతోపాటు ఏదైనా మహిళలపై నేరం జరుగుతున్నప్పుడు ఆమె స్పందిస్తున్న తీరు కూడా అభ్యంతర కారంగా ఉంది. దీనిపై ఇప్పటికే విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం చెబుతున్న సమయంలో హోం మంత్రి ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. కేవలం ఆమె నియోజకవర్గంలో గడపగడపకు కార్యక్రమంలో మాత్రమే ఆమె పాల్గొంటున్నారు.

కేవలం కొవ్వూరుకే హోం మంత్రి

సచివాలయంలో నిత్యం అందుబాటులో ఉంటూ రాష్ట్రంలోని శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కీలకమైన బాధ్యతలు హోం మంత్రి వి. ఒకప్పుడు ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన బాధ్యతలుగా వాటిని భావించేవారు. అంతటి కీలకమైన బాధ్యతలు ఉన్నప్పటికీ తానేటి వనిత మాత్రం సచివాలయానికి వస్తున్నది చాలా తక్కువ రోజులే. వచ్చిన సరే కేవలం పెండింగ్లో ఉన్న ఫైల్స్ ను చూసి సంతకాలు పెట్టేవరకే ఆమె పరిమితం అవుతున్నారు. మిగిలిన అన్ని విషయాలను సకల శాఖ మంత్రి చూసుకుంటున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. పెండింగ్లో ఉన్న సంతకాలను పెట్టేసి వెంటనే కొవ్వూరు నియోజకవర్గం వెళ్లి ప్రతిరోజు గడపగడపకు కార్యక్రమంలో ఆమె తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు తప్పితే హోం మంత్రిగా తన మార్కు పాలన అందించాలని ఆమె కనీసం ఒక్క అడుగు ముందుకు వేయకపోవడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *