fbpx

మోదీ అనుకూల కార్పొరేట్ శక్తుల చేతిలో రవాణా రంగం

Share the content

కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాల్సింది పోయి ప్రమాదాలకు డ్రైవర్లను భాద్యులను చేయడం అన్యాయం అని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య లు తెలిపారు. ది కాకినాడ మినీ గూడ్స్ లారీ అండ్ వేన్ ఓనర్స్ అసోసియేషన్ భవన నందు సిఐటియు కాకినాడ నగర అధ్యక్షులు పలివెల వీరబాబు ఆహ్వానం మేరకు సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జి అధ్యక్షతన ట్రాన్స్ పోర్ట్ కార్మికుల జిల్లా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జాతీయ రహదారులపై ఎక్కడా కూడా డ్రైవర్లకు విశ్రాంతి సదుపాయం ఏర్పాటు చేయకుండా ప్రమాదాలను నివారించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నేషనల్ పర్మిట్లు కలిగి రాష్ట్రాలు దాటివెళ్లే రవాణా వాహనాలకు ఇద్దరు డ్రైవర్లు ఉండాలనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం తొలగించి ప్రమాదాలు పెరగడానికి కారణమవుతుందని విమర్శించారు. ప్రతీ 100 కిలోమీటర్లకు 28 యూటర్న్స్ జాతీయ రహదారులపై ప్రభుత్వమే ఏర్పాట్లు వలన ప్రమాదాలు పెరగడానికి కారమవుతుందని తెలిపారు.

దేశంలో అతిపెద్ద ప్రమాదమైన జబ్బార్ ట్రావెల్స్ ఘటనలో కారణాలను విశ్లేషిస్తూ ఐపీఎస్ అధికారి ఇచ్చిన నివేదికలో తీసుకోవాల్సిన చర్యలు ఇప్పటివరకు తీసుకోకుంటే ప్రమాదాల నివారణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత దారుణంగా జరిమానాలు విధించటంలేదని, వ్యక్తి ఆదాయాన్ని బట్టి జరిమానాలు విధించే శాస్త్రీయ పద్ధతులు పాటించకుండా బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన న్యాయ సంహిత హిట్ & రన్ చట్టాన్ని పార్లమెంటులో వెనక్కి తీసుకోకుండా, ఆగిపోయిందని ప్రచారం చేసే మేధావులు డ్రైవర్లను తడిగుడ్డతో గొంతుకొస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ సేఫ్టీ బిల్లులో సెక్షన్ 93లో తో ఒక కొత్త విధానాన్ని అగ్రిగేటర్ ను పరిచయం చేసరన్నరు. ఒకటి, రెండు వాహనాలు నడిపే యజమానులు స్థానంలో కార్పొరేట్ మధ్యవర్తులు ఓలా, ఉబర్ సంస్థల చేతికి మొత్తం రవాణా రంగాన్ని అప్పగించే పని చేయడానికే ఇలాంటి ప్రజావ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి వాహనాలు నడపడం కష్టతరం చేసే కుట్రను వాహన యజమానులు గుర్తుపెట్టుకోవాలన్నారు. రవాణా కార్మికులకు తక్షణం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి ఆదుకోవాలని, పెట్రోల్, డీజిల్ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, పార్లమెంటులో హిట్ అండ్ రన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు ఫిబ్రవరి 16 దేశవ్యాప్తంగా జరిగే ట్రాన్స్ పోర్ట్ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సదస్సులో ది కాకినాడ మినీ గూడ్స్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు బొగ్గు సత్యనారాయణ, కాకినాడ ఆటో యూనియన్ నాయకులు తాతపూడి మూర్తి, అమరావతి మినీ గూడ్స్ వ్యాన్ యూనియన్ నాయకులు వై నాగరాజు, గూడ్స్ ఆటో యూనియన్ నాయకులు గుండుబోగుల శ్రీను, పెండెం సత్యనారాయణ, రెడ్డిపల్లి రమేష్, ఎలుగుబంటి లక్ష్మీనారాయణ, తులసి ప్రసాద్, సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, టి రాజా, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *