fbpx

బీజేపీ గేమ్ స్టార్ట్ చేసిందా??

Share the content

ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పథకాల్లో కేంద్రం వాటా ఎక్కువ అయితే దానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తమ పేర్లు పెట్టుకుని తమ ఫోటోలు వాడుకుంటుందని చాలాసార్లు బిజెపి నాయకులు చెబుతూ వచ్చారు అయితే ఈసారి ఏకంగా దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా హెచ్చరికలు పంపడం రావలసిన నిధులను ఆపివేయడం ఇప్పుడు సీరియస్ అంశంగా పరిగణించవచ్చు. ఇప్పటివరకు చేతలతోనే సరిపెట్టిన కేంద్రం ఇప్పుడు రాష్ట్రం మీద, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మీద సీరియస్గా దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న చాలా స్కీం లలో కేంద్రం వాటా చాలా ఎక్కువగా ఉంది. కేంద్రం నిధులు ఇస్తుంటే దానికి కనీసం కేంద్రం పేరు కూడా చెప్పకుండానే వైసీపీ ప్రభుత్వం సొంత పేర్లు పెట్టుకుంటూ నిధులను వాడుకుంటుంది. దీనిపై చాలాసార్లు హెచ్చరికలు పంపిన కేంద్ర ప్రభుత్వం దానిని పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఏకంగా నిధులు నిలిపివేత దిశగా అడుగులు వేసింది. ఆంధ్రప్రదేశ్ కు రావలసిన 4వేల కోట్ల రూపాయలను నిలిపివేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో అమలు అవుతున్న అన్ని పథకాలు కేంద్రం వాటా తో ముడిపడిన పథకాల్లో కచ్చితంగా కేంద్రం పేరును తగిలించాలని సొంత పేర్లు సొంత ఫోటోలను పూర్తిగా పక్కన పెట్టాలని కేంద్రం హెచ్చరించింది.

** జగన్ ఏ పని చేసినా సరే దానిని నవ్వుతూ స్వాగతిస్తూ ఢిల్లీలో అపాయింట్మెంట్లు ఇచ్చిన కేంద్రం పెద్దలు ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ వైసిపి ప్రభుత్వానికి విలన్లుగా మారుతున్నారు. ఒకపక్క ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి ఘాటుగా వైసిపి పెద్దల మీద నేరుగా దాడి చేస్తుంటే ఇప్పుడు కేంద్రం సైతం రాష్ట్రానికి రావలసిన నిధులను నిలిపివేయడం చూస్తుంటే రాష్ట్రంలో ఏదో జరగబోతోంది అన్న సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. జనసేన తెలుగుదేశం కూటమికి దూరంగానే ఇప్పటివరకు కొనసాగుతున్న బిజెపి అదే రీతిలో వైసీపీని కూడా దూరంగానే పెట్టింది. ఇప్పుడు ఏకంగా పురందరేశ్వరి రూపంలో వైసిపి అక్రమాల మీద సిబిఐ విచారణ చేయాలి అనేలా పెద్ద బాంబు పేల్చబోతున్నట్లు అర్థమవుతోంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో వాటిని అమలు చేయడం లేదని కచ్చితంగా దీనిలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని చెప్పడం ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఇరుకును పెట్టే ఆలోచనలో బిజెపి ఉందా అనే అనుమానం కలుగుతుంది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిస్థితి వచ్చినా కేంద్రంలో ఖచ్చితంగా బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అంశంలో ఎలాంటి డోకా ఉండదు అని అంతా భావించారు. దీనికి తగినట్లుగానే కేంద్ర పెద్దలు కూడా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిని పరిశీలించడం మినహా సీరియస్ గా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడు మాత్రం బిజెపి వైఖరిలో కాస్త మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. వైసీపీని టార్గెట్ చేస్తూ బిజెపి నాయకులు అలాగే కేంద్ర పెద్దలు కూడా చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొదటిగా పురందరేశ్వరి ని రంగంలోకి దింపి మద్యం ఇసుక కుంభకోణాలతో పాటు నెంబర్ 2 గా ఉన్న వైసిపి నాయకుడు విజయ్ సాయి రెడ్డి మీద ఘాటైన లేఖతో రాజకీయం మొదలు పెట్టిన బిజెపి ఇప్పుడు సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా లేకుంటే కచ్చితంగా నిధులు నిలిపివేస్తామని చెప్పడం ద్వారా వైసీపీ మీద క్రమక్రమంగా యుద్ధం మొదలుపెట్టినట్లే చెప్పాలి. జరుగుతున్న పరిణామాలు జనసేన తెలుగుదేశం పార్టీ కోటమికి అనుకూలంగా ఉంటే వైసీపీకి ప్రతికూలంగా మారుతున్నాయి. ఇది సమీప భవిష్యత్తులో ఎంతవరకు వెళుతుంది అన్నది అలాగే బిజెపి రాజకీయ అడుగులు ఎటువైపు అన్నది మెల్లగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *