fbpx

నేరస్థులను కంటికి రెప్పలా కాపాడుతున్న వైసిపి

Share the content

రాష్ట్రంలో అధికార వైసిపి పార్టీ నాయకులు నేరాలను ప్రేరేపిస్తూ, నేరస్థులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్ నజీర్ కు టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. శేషాచలం అడవుల్లోనే దొరికే అరుదైన ఎర్ర చందనంను ప్రభుత్వమే స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకొని మాఫియాను ప్రేరేపింస్తుందని వారు తెలిపారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితి గురించి వారు గవర్నర్ కు తెలిపారు. వైసిపి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా చూసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.వైకాపా నేతల ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతుందనీ పేర్కొన్నారు..

ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను అడ్డుకున్న అన్నమయ్య జిల్లా చిన్నపల్లె గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్‌ కె. గణేష్‌ను … ఎర్ర చెందనం మాఫియా కారుతో గుద్ది చంపారని వారు తెలియజేశారు. ఎర్ర చందనం స్మగ్లరైన విజయనంద రెడ్డిని ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్‌గా నియమించటమే కాకుండా రానున్న సార్వత్రిక ఎన్నకల్లో చిత్తూరు నుంచి బరిలోకి దింపేందుకు అధికార పార్టీ ఆలోచిస్తుందని వారు అన్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో క్రైమ్ రేటు అధికంగా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడి, ఎర్ర చందనం మాఫియాకు బలైన కె.గణేష్‌ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను వారు కోరారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన రావు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *