fbpx

అక్కడ నందమూరి కుటుంబం బరిలో ఉంటుందా?

Share the content

రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టిడిపి వినూత్న రీతిలో ఆలోచనలు చేస్తుంది. ప్రతి నియోజకవర్గంలోనూ బలమైన అభ్యర్థులను ఉండే విధంగా కార్యాచరణ చేస్తుంది. పార్టీకి మైనస్ అయిన విషయాలపై అధినేత చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగానే నందమూరి కుటుంబానికి అన్యాయం చేశారు అనే అపవాదను తుడుచుకునేందుకు బలమైన నిర్ణయం తీసుకోనున్నారు. టిడిపి అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుంటున్న నియోజకవర్గం గన్నవరంలో టిడిపిని గెలిపించేందుకు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల మరణించిన నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్యరెడ్డిని గుడివాడ నుండి ఎన్నికల బరిలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

గుడివాడ సీటుపై కన్నేసిన నేతలు..

నియోజకవర్గం పర్యటనలో భాగంగా బలమైన అభ్యర్థులనుఖరారు చేస్తూ వస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా గుడివాడ పర్యటనలో అభ్యర్థిని మాత్రం ఖరారు చేయలేదు. గుడివాడలో టిడిపి నేతలు రావి వెంకటేశ్వరరావు, వెనిగంటల రాము ఈ ఇద్దరు నేతలు నియోజకవర్గ సీటు కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికే అధినేత చంద్రబాబు నాయుడుతో సిటు మంతనాలు జరుపుతున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ గుడివాడ సీటును నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డికి ఇవ్వవలసిందిగా కోరినట్లు తెలుస్తోంది. నందమూరి తారకరత్న కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలకృష్ణ తో చెప్పారని తారకరత్న స్థానంలో అలేఖ్య రెడ్డికి సీటు ఇవ్వవలసిందిగా బాలయ్య చంద్రబాబును కోరుతున్నారు.

ఆమె సిద్ధంగా ఉన్నారా..

లోకేష్ కుప్పం పర్యటనలో పాల్గొన్న నందమూరి తారకరత్న పాదయాత్రలో కుప్ప కూలి పది రోజులు ఐసీయూలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. కనీసం రాజకీయ అనుభవం లేనటువంటి అలేఖ్య రెడ్డి టిడిపి తరఫున గన్నవరం నియోజకవర్గ నుండి పోటీ చేయడానికి ఒప్పుకుంటారా అనే విషయం టిడిపి వర్గాల్లో చర్చనియాంశంగా మారింది అలేఖ్య రెడ్డి సొంత బాబాయ్ విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తన కుటుంబానికి అండగా ఉంటున్నారు. బాబాయ్ వ్యతిరేక పార్టీ అయిన టిడిపికి ఆమె అనుకూలంగా గన్నవరం నియోజకవర్గం నుండి బరిలో దిగుతారా అనే విషయం త్వరలోనే తెలియాల్సి ఉంది. నందమూరి కుటుంబం నుండి ఎన్నికల బరిలో దిగితే నందమూరి కుటుంబం మద్దతు కూడా అలేఖ్య రెడ్డికి వస్తుంది. నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సైతం అలేఖ్య రెడ్డికి మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో టీడీపీకి మరింత బూస్ట్ వచ్చి గన్నవరంలో టిడిపి జెండా ఎగురుతుందని టిడిపి నేతలు ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *