fbpx

గల్లా జెండా మారుస్తారా??

Share the content

గల్లా జయదేవ్.. రాజా బ్యాటరీస్ ఎండి. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గల్లా కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో గల్లా అరుణ్ కుమారి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. గల్లా జయచంద్ర నాయుడు చైర్మన్ గా ఉన్న అమర్ రాజా ఫ్యాక్టరీస్ కు దేశవ్యాప్తంగా ను మంచి వ్యాపారం ఉంది. గల్లా జయదేవ్ గల్లా అరుణ్ కుమారి రాజకీయ వారసుడిగా రాజకీయాలకు వచ్చి టీడీపీలో చేరారు. రెండు పర్యాయాలు వరుసగా గుంటూరు లోక్ సభ నుంచి గెలిచిన గల్లా జయదేవ్ ఇప్పుడు తాజాగా పార్టీ మారాలని భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీ వైపు గల్ల జయదేవ్ చూస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్థానం నుండి గల్లా జయదేవ్ వైసీపీ తరఫున పోటీలో ఉంటారు అన్న ప్రచారం ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది.

ఎందుకు ప్లేట్ మార్చారు?

గల్ల కుటుంబం నిన్న మొన్నటి వరకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలు కొనసాగించేది. ముఖ్యంగా సొంత జిల్లా అయిన చంద్రబాబు నాయుడు గల్లా కుటుంబానికి మంచి ప్రాధాన్యం ఇచ్చారు. గల్లా కుటుంబంతో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు కూడా దీనికి దోహదం చేశాయి. అయితే గత కొన్ని రోజులుగా గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరం పాటిస్తున్నారు. పార్టీకి సంబంధించిన కీలక కార్యక్రమాల్లోనూ గల్లా జయదేవ్ కనిపించలేదు. రాజమండ్రిలో ప్రతిష్టాత్మంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడులోను గల్లా జయదేవ్ కనిపించలేదు. దీంతో గల్లా జయదేవ్ ఎక్కడ అంటూ చర్చ మొదలైంది. దీనికి తగినట్లుగానే గల్లా జయదేవ్ కూడా టిడిపి నాయకులకు పూర్తిగా టచ్ లో లేకుండా పోయారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో వైసిపి తరఫున గల్లా జయదేవ్ పోటీ చేస్తారనే ప్రచారం విపరీతంగా జరుగుతుంది. దీనిపై కనీసం ఆయన వైఖరి కనుక్కునేందుకు టిడిపి నేతలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ జయదేవ్ మాత్రం ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు. మరోపక్క వైసీపీ నేతలతో గల్లా జయదేవ్ టచ్ లో ఉన్నారు. విజయవాడ ఎంపీ కేసినేని నానితో సన్నిహిత సంబంధాలు ఉన్న గల్లా జయదేవ్, అదే బాటలో కేశినేని నానితో సహా వైసీపీలో చేరుతారని ప్రచారం ఇప్పుడు బలం పుంజుకుంది. వచ్చే ఎన్నికల్లో గల్లా జయదేవ్ గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని అయితే అది వైసిపి తరఫున ఉంటుందని ఇప్పుడు జోరుగా ప్రచారంలో ఉంది. దీంతోపాటు తెలుగుదేశం అధిష్టానం సైతం గుంటూరు లోక్ సభ స్థానం నుంచి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి షిఫ్ట్ అయ్యే నాయకుడు ఆలపాటి రాజాను అభ్యర్థిగా నిలబెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *