fbpx

వేగంగా గోదావరి రాజకీయం

Share the content

ఉభయగోదావరి జిల్లాల్లో రాజకీయం జోరందుకుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అనంతరం అధికార వైసిపి పార్టీ నేతలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఉభయగోదావరి జిల్లాలో క్లీన్ స్వైప్ చేయాలనే జనసేన వ్యూహాన్ని తిప్పి కొట్టేందుకు నేతలు కసరతులు ప్రారంభించారు. గోదావరి జిల్లాలో పార్టీ లోటుపాట్లు వెతుక్కునే పనిలో పడ్డారు. జిల్లాల కోఆర్డినేటర్లు ఇన్చార్జిలు తరచుగా సమావేశాలు నిర్వహించి గెలుపే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు ఉగ్రరూపం దాల్చి జనసేనాని మాటలకు కౌంటర్స్ ఇచ్చారు. ఉభయగోదావరి జిల్లాలో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో క్లీన్ స్వైప్ చేస్తామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలను చేతలతో తిప్పికొట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

రంగంలోకి కోఆర్డినేటర్స్

ఉమ్మడి గోదావరి జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్ గా నియమితులైన మిథున్ రెడ్డి వరుస సమావేశాలతో నేతలను సమయత్వం చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రథమ స్థాయి నేతలతోనే చర్చలు జరిపిన మిథున్ రెడ్డి మొదటిసారిగా ద్వితీయ స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసంతృప్తి పరులను బుజ్జగిస్తూ ఎవరు పార్టీ వీడకుండా ఉండాలని నిస్పక్షపాతంగా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని చెప్పకు వస్తున్నారు. అలాగే పార్టీలో ఉన్న లోపాలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంత కుల నాయకులతో కూడా మిధున్ రెడ్డి త్వరలో సమావేశం కానునట్టు తెలుస్తుంది. అలాగే ఉభయగోదావరి జిల్లాల్లో స్థానికంగా టిడిపి జనసేన పొత్తుల బలం ఎలా ఉంది ప్రత్యర్థులు ఎవరు వారి బలం ఎంత అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో తృతీయ స్థాయి నేతలతో మాట్లాడి నివేదికను అధినాయకత్వానికి పంపుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారాన్ని శాసించే ఉభయగోదావరి జిల్లాల్లో తమ బలాన్ని పెంచుకునేందుకు మిధున్ రెడ్డి తెగ కష్టపడి పోతున్నారు. ఇప్పటివరకు పార్టీ కోసం తమ పని తాము చేసుకుంటూ పోతున్న నేతలను స్వయంగ మిథున్ రెడ్డి వంటి పెద్ద స్థాయి నేతలు చర్చలు జరపడంతో నేతలు మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *