fbpx

వైసిపి కొత్త విధానంతో రైతులకు తిప్పలు..

Share the content

ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి అందే సమయానికి ప్రకృతి కోపానికి రైతు బలైపోతున్నాడు. భూమినే నమ్ముకున్న బతుకులు చిద్రమవుతున్నాయి. పది మందికి కడుపు నిండా అన్నం పెట్టే రైతు గుండె చెరువు అవుతుంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయి. ప్రభుత్వాలు మారుతున్న ధాన్యం కొనుగోలు చేయడానికి రైతులు ఇబ్బందులు పెడుతున్నారు. రాను రాను సాగు మరింత కష్టమవుతుందంటూ రైతు గగ్గోలు పెడుతున్నాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎదురవుతున్న కొత్త ఇబ్బందులు, పడుతున్న వేదన వర్ణాతీతం రైతు కష్టాలకు అసలు కారణం ఏంటీ? ఎందుకు ఈ ప్రభుత్వం రైతు సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తోంది..? వైసీపీ ప్రభుత్వం వచ్చాక రైతు కష్టాలు ఎందుకు పెరిగాయి? క్షేత్రస్థాయిలో పరిస్థితులను విశ్లేషిద్దాం.

కౌలు రైతుల జీవితానికి భరోసా లేదు

కౌలు రైతులకు సంబంధించి కనీసం ఆరోగ్య బీమా లేదు. రేషన్ కార్డులు లేవు. ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డులు అందని పరిస్థితి ఉంది. గోదావరి జిల్లాల్లో దాదాపు 80 శాతం మంది కౌలు రైతులే ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. నాకు రూ. 25 లక్షల అప్పు ఉంది. నాకు వేరే పని తెలియదు. పురుగు మందులు, యూరియా ధరలు బాగా పెరిగాయి. అన్నీ ధరలు పెరిగాయి. రైతు భరోసా కేంద్రాలకు వెళుతుంటే సిబ్బంది సమాధానం చెప్పడం లేదు. యంత్రాల అద్దె ధరలు కూడా ఎక్కువయ్యాయి. ఎత్తుబడులకు అధిక ఖర్చులు తప్పడం లేదు. ఏడాదికి రూ. 40 కౌలు కట్టుకొని వ్యవసాయం చేసుకోలేకపోతున్నాం. కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. ధాన్యం డబ్బులు ఇవ్వడానికి కూడా ముప్పు తిప్పలు పెడుతోంది.

రైతుల డబ్బుతో ప్రభుత్వం వ్యాపారం చేస్తోంది…

అన్ని రాష్ట్రాల్లోనూ ధాన్యం కొనుగోలు చేయగానే రైతులకు ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం వచ్చాక రైతులు ధాన్యం అమ్మిన డబ్బులు సుమారు రెండు నుంచి మూడు నెలలు సమయం పడుతోంది. ప్రతి రైతు ఖాతాలో 21 రోజులకే ధాన్యం డబ్బులు వేస్తామని వైసీపీ పాలకులు, అధికారులు చెబుతున్న మాటలన్నీ బూటకం. ధాన్యం సేకరణ డబ్బులు కేంద్రం వేస్తుంటే, వాటిని సకాలంలో రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు మనసు రావడం లేదు. రైతుల డబ్బులతో ప్రభుత్వం వ్యాపారం చేస్తోంది. రైతుల డబ్బులను ప్రభుత్వ ఖాతాలో ఉంచుకొని వాటిని సంక్షేమ పథకానికి మళ్ళించి రైతులను మోసం చేస్తున్నారు. ఫలితంగా సాగు పెట్టుబడి కోసం షావుకారులు వద్ద తీస్తున్న అప్పులకు వడ్డీలు భారం అవుతున్నాయి. రెండు, మూడు నెలల వడ్డీ కట్టాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. రైతుల డబ్బులతో వ్యాపారం చేస్తున్న ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి.

ఎద్దుల బండిమీద ధాన్యం తెస్తే తీసుకోరట…

రైతులు రవాణా ఖర్చులను పెట్టుకొని మరీ రైస్ మిల్లర్లకు తోలుతూ ఉంటే ధాన్యం తీసుకుంటున్నారు. ఎద్దుల బళ్లు మీద ధాన్యం రైస్ మిల్లు తోలితే తీసుకోరట. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఎద్దుల బళ్లు మీద ధాన్యం తోలడం అనేది అనాదిగా వస్తోంది. అయితే రైస్ మిల్లర్లు మాత్రం ఇప్పుడు కొత్తగా వాహనాల నెంబర్లు కావాలని, ఎద్దుల బళ్లు మీద ధాన్యం తీసుకొస్తే దింపుకోవడం లేదు. ఎందుకు అని అడిగితే మిల్లర్ల వద్ద సమాధానం కూడా ఉండడం లేదు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. రవాణా ఖర్చులు అధికంగా రైతులే మోయాల్సి వస్తుంది. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో రావో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. దగ్గరగా ఉండే రైస్ మిల్లులకు ధాన్యం పంపకుండా, 20, 40 కిలోమీటర్ల దూరం ఉన్న రైస్ మిల్లులను కౌలు రైతులు కేటాయిస్తున్నారు. దీనివల్ల అంత దూరం రవాణా ఖర్చులు మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇది మరింత భారంగా మారింది. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు.

గోనె సంచులు ఇవ్వని దుర్మార్గం..

కోతలు కోసే సమయంలోనే గోనె సంచులు ఇవ్వాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రబీ గాని ఖరీఫ్ లో గానీ రైతులకు ప్రభుత్వం గోనె సంచులు ఇవ్వడం లేదు. సకాలంలో వాటిని సరఫరా చేస్తే అకాల వర్షాల దెబ్బకు రైతులకు ఇంత నష్టం వచ్చి ఉండేది కాదు. ప్రభుత్వం కూడా రబీలో పండించిన పూర్తి ధాన్యాన్ని కొనడం లేదు. కొన్ని బస్తాలను తగ్గించి తీసుకుంటోంది. మిగిలిన బస్తాలను ప్రైవేటు వ్యాపారులకు దళారులకు అమ్ముకోవాలని అధికారులు చెబుతున్నారు. లక్ష్యం పూర్తయిపోయిందని కూడా ధాన్యం తీసుకోవడం లేదు. ఇది రైతులకు వేదన కలిగిస్తోంది. పంట నాశనం అయినంత వరకు కూడా గోనె సంచులు ఇవ్వలేదు. మీరు వస్తున్నారని తెలియగానే గోనె సంచులు తీసుకొచ్చారు. ముందుగా అవి ఇచ్చి ఉంటే ఇంత నష్టం వచ్చేది కాదు. వర్షాలు పడిన తర్వాత కూడా తేమ శాతం లెక్కల్లో చాలా తేడా ఉంటోంది.

గింజ కొనమంటే అరెస్ట్ చేసి హింస

గిట్టుబాటు ధర లేదని, మొలకలు వచ్చిన ధాన్యం కొనమని ఆర్డివోను కలిసి వినతి పత్రం ఇవ్వాలని వెళితే పోలీసులు అరెస్టు చేశారు. దారుణంగా హింసించారు. మేం పండించిన ధాన్యం అమ్ముకోవాలన్నా నేరం అవుతోంది. పోలీస్ కస్టడీలో జంతువులు కంటే ఘోరంగా చూశారు. చివరకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఏ పంట వేయాలో ఎవరూ చెప్పడం లేదు. ఏదైనా సమస్య వస్తే కనీసం పట్టించుకుంటున్న దాఖలాలు ఉండడం లేదు. రైతు భరోసా కేంద్రాల సిబ్బంది రైతుకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసా డబ్బులు సైతం కౌలు రైతులకు ఏమాత్రం అందడం లేదు.

బొండాలు వెయ్యమంది వాళ్లే.. కొనేది లేదన్నది వాళ్లే..

నవంబర్ 2, 2022లో ప్రస్తుత పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కేరళలో పర్యటించి కేరళ మంత్రి అనిల్ తో బొండాలు రకం ధాన్యం (ఎంటీయూ 3626 రకం ) ఎంవో యూ చేశారు. ఏటా ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందించేలా ఒప్పందం కుదిరింది. కేరళలో మంచి డిమాండ్ ఉన్న బొండాలు రకాలు ధాన్యం గోదావరి జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో సాగు అయినట్లు అంచనా. వీటిని కొనడానికి అధికారులు నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. బొండాలు రకం ధాన్యానికి రూ.1520 మేర మద్దతు ధర ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 1300 మాత్రమే ఇస్తామని బేరాలు ఆడుతున్నారు. వాటిని ఎందుకు కొనరు అని ప్రశ్నిస్తుంటే అధికారులు ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. కౌలు రైతులు అధికారులు కార్యాలయాలు చుట్టూ తిరగలేకపోతున్నారు. ధాన్యం ఎవరు వేయొచ్చని చెప్పారో, వారు మాత్రం ఇప్పుడు కొనడానికి ముందుకు రావడం లేదు.

ఈక్రాప్ నమోదు సరిగా లేదు..

ఈ క్రాప్ నమోదు సరిగా లేదు. క్షేత్రస్థాయిలో రైతుల పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం సాంకేతికంగా తీసుకువచ్చిన ఈ క్రాప్ లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. సరైన రీతిలో క్షేత్రస్థాయి సిబ్బంది ఈ క్రాప్ నమోదు చేయకపోవడంతో అసలు రైతులకు అన్యాయం జరుగుతోంది. పంటల పూర్తి వివరాలు నమోదు దానిని పండించే రైతు ఎవరు అన్నది ఈ క్రాప్ లో నమోదు చేయాలి. అయితే క్షేత్రస్థాయిలో ఇష్టానుసారం నమోదు చేయడంతో ప్రతిసారి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పంట నష్టం వచ్చిన సమయంలో రైతులకు ఈ క్రమ వల్ల మరిన్ని ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి.

అకాల వర్షాలు వస్తే అదనపు భారం..

వ్యవసాయ కూలీలు ప్రస్తుతం ఎక్కడ దొరకడం లేదు. వ్యవసాయ కూలీల ఖర్చు భరించడం రైతులకు కష్టతరమవుతుంది. యంత్రాల మీద ఆధారపడుతుండడంతో మధ్యవర్తులు దళారులు యంత్రాల ఖర్చులు ఎక్కువ చేసి రైతులను మోసం చేస్తున్నారు. డిమాండ్ మేరకు యంత్రాల అద్దె ధరాలు పెరుగుతున్నాయి. అకాల వర్షాలు వచ్చే సమయంలో మొత్తం ఇది రెట్టింపు అవుతుంది. యంత్రాలు పొలంలోకి రావాలన్నా, ముందుకు కదలాలన్నా సరే ఎక్కువ అవుతోంది. పొలంలోకి యంత్రం వచ్చే దారిని సైతం ప్రత్యేకంగా రైతులు వేయించుకోవలసిన పరిస్థితి ఎదురవుతోంది. విత్తనాల ధర దగ్గర నుంచి పురుగుమందులు, ఎరువులు, అలాగే వ్యవసాయ కూలీలు యంత్రాలు ఖర్చులు చాలా ఎక్కువ అయ్యాయి. పంట బాగా పండితే కౌలు రైతులకు మిగిలేది కనీసం రూ.5 వేలు కూడా ఉండడం లేదు. మరో దారి లేక వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ధాన్యం అమ్మడానికి వెళితే
నూక లెక్కలు తప్పు చెప్తున్నారు. ప్రతి బస్తాలు 40 శాతం వరకు నూక ఉంటుందని, మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు. అధికారులకు చెబుతుంటే వారి దగ్గర నుంచి సమాధానమే ఉండడం లేదు.
రైతులకు ఏమాత్రం ఉపయోగపడని రైతు భరోసా కేంద్రాలు ఎందుకో కూడా అర్థం కావడం లేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వేలకోట్లు ఖర్చు చేయడం దారుణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *