fbpx

అమ్మేస్తున్న కరువు మేఘాలు.

Share the content

రాష్ట్రానికి కమ్మేస్తున్న కరువు పరిస్థితిని దాచి పెట్టేందుకు వైసిపి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. ఆపదలో ఉన్న అన్నదాతలను ఆదుకోవాల్సింది పోయి… ఆపదే రాలేదన్నట్లుగా ప్రవర్తిస్తుంది. రాష్ట్రంలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా సగటు వర్షపాతం నమోదు అయింది. అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలతో పాటు, కృష్ణ డెల్టా, గుంటూరు చానలలో నీరు లేకపోవడంతో సస్యశ్యామలంగా కనిపించే ప్రాంతాలు బీడులు వారి కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో ఖరీఫ్లో సాధారణంగా సగటున 72 లక్షల కు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారు. ఈసారి సుమారు 25 లక్షలు ఎకరాల్లో సాగు ముందుకు సాగటం లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వ్యవసాయ, ఉద్యాన పంటలు కరువు ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరత, మరికొన్ని ప్రాంతాల్లో సాగునీటి సరఫరా సమస్య ఏర్పడుతుంది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలనికి చెందిన వివిధ గ్రామాల్లో తాగునీటి కోసం అక్టోబర్ నెలలోనే ప్రజలు రోడ్డుకి ఆందోళన చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం ఆ జిల్లాలో కరువును ప్రకటించకపోవడం విశేషం.కృష్ణ డెల్టాల్లో వరి సాగుదారులకు సాగునీటి కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. వరి పొట్ట ఈనే దశలో ఉండడంతో ఈ సమయంలో అధికంగా నీరు అవసరం అవుతుంది. అయితే సాధారణ స్థాయిలో కూడా నీరు లేకపోవడంతో ఏం చేయాలో అయోమయ పరిస్థితిలో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా, బాపట్ల జిల్లాలో నీటి సమస్య ఎక్కువగా ఉంది. రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు.వరి పొలాలు బీటలు వాడుతుండడంతో ఏలూరు, పల్నాడు జిల్లాలో కూడా రైతులు ఆవేదనతో కనిపిస్తున్నారు. పెట్టుబడి పెట్టే తీవ్రంగా నష్టపోయామని వర్షాభావంతో దెబ్బతిన్న రైతులు వాపోతున్నారు. 2019లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కరువు మండలాలు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు పాలనలో పదేపదే కరువు పై విమర్శించిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు తన పాలనలో పరిస్థితిపై అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక జాబితాలో ఉన్న కరువు మండలాలు అరాకొరగానే ఉన్నట్టు రైతు సంఘాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో పంట కాలం దాటిపోయిన తర్వాత కురిసిన వర్షాలను కూడా లెక్కించి కరవ మండలాల సంఖ్యలో కోత పెట్టినట్టు తెలుస్తుంది. 319 మండలాలను కరువు జాబితాలో చేర్చాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది.
జగన్ అధికారంలోకి వచ్చాక విపత్తుల కారణంగా రాష్ట్రంలో సుమారు 15 వేల కోట్లకు పైగా విలువైన పంటలను రైతులు నష్టపోయారు. కోత అనంతరం నష్టాలు అంటే ధాన్యం తడిసి మొలకెత్తడం మద్దతు ధర తగ్గకపోవడం తదితర ఇబ్బందులను కలిపితే నష్టం ఇంకా పెరుగుతుంది. ప్రభుత్వం పెట్టుబడి రాయితీగా 2వేల కోట్లు అయినా ఇవ్వలేదు. నష్టపోయిన వారంతా చిన్నకారు రైతులు వీరిలో అధిక శాతం కౌలుదారులే పంట నష్టం కళ్ళముందు కనిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం బహిరంగ సభల్లో తమ ప్రభుత్వంలో కరవు ప్రాంతాలు లేవంటూ చెప్పడం రైతులను ఆగ్రహానికి గురిచేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *