fbpx

ఏలూరు నియోజకవర్గం సీటు ఈ సారి ఆమెకేనా..?

Share the content


ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని వచ్చే ఎన్నికలలో పోటీ చేయటం లేదు అనే ప్రచార జోరుగా సాగుతుంది. ముఖ్యమంత్రి జగన్ కి అత్యంత సన్నిహితుడిగా రెండున్నర ఏళ్ళు ఆరోగ్యశాఖ మంత్రిగా భాద్యతలు నిర్వర్తిఉంచిన ఆళ్ల నాని ఎంపీ బరిలో పోటీ చేయనున్నట్టు సమాచారం.

ఏలూరు నియోజక వర్గ ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల నానిసైలెంట్ వెనుక కారణం అదేనా…?

ఏలూరు ఎమ్మెల్యే నాని వైస్సార్సీపీ లో సీనియర్ నేత పార్టీ ఆవ్రిభవం నించి పార్టీలో చురుకుగ వున్నారు. 2014 లో పోటీ చేసి ఓడిపోయి ఏలూరు నియోజకవర్గానికి దూరంగ ఉన్నప్పటికీ 2019 ఎన్నికలకి ముందు చురుకు అయ్యారు. పార్టీ గాలిలో భాగంగా ఏలూరు నియోజకవర్గం లో జనసేన ఓట్ల చీలికలో భాగంగా టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జిపై ఆళ్ల నాని 4200 పై చిలుకు ఓట్లతో గెలుపొందారు.నిజానికి జనసేన ఓట్ల చీలిక లేకుంటే ఈ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీనే గెలిచేది. గెలుపు తర్వాత ఆళ్ల నానికి మంత్రి పదవి వరించటం మూడు ఏళ్లపాటు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి వర్గ పనుల్లో నియోజక వర్గ అభివవృద్ధి పైన దృష్టి పెట్టకపోవడం పార్టీ వర్గాల్లో అనుచరుల మధ్య విభేదాలు. గత మంత్రి వర్గ విస్తిరణలో మంత్రి పదవి కోల్పోయిన తరువాత నియోజక వర్గంలో రాజకేయం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇంతలో పార్టీ లో విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి వాటిని నాని పట్టించుకోకపోవటం చుట్టపుచూపుగా నియోజకవర్గానికి రావటం. అటు జనసేన టీడీపీ ప్రజలో చురుకుగా తిరగటం అభివృద్ధి పైన ప్రశ్నించటం, మెడికల్ కాలేజ్ పైన వివాదాలు అధికార పార్టీకి ఇబ్బందిగ మారాయి.ఐ ప్యాక్ టీమ్ సర్వేలో కూడా ప్రజా స్పందన సరిగా లేదనే తెలుస్తుంది. ఆళ్ల నాని విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ ఎన్నికల సమయానికి చురుకు అవుతారని ఎన్నికల పోల్ మేనేజ్మెంట్లో రాజకీయా వ్యూహాత్మకంగా వ్యవహరించటంలో ఆళ్ల నానికి పట్టు ఉండటంతో ఎన్నికల మూడునెలలముందు రాజకీయంగా అయన చురుకు సరిపోతుంది అని పార్టీ భావిస్తుంది. ఈ సరి ఎన్నికలలో బీసీ సామజిక వర్గానికి మహిళలకి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు.
టీడీపీ నుంచి చింతమా నేని ప్రభాకర్ ఎంపీ బరిలో ఉండనున్నారు. చింతమనేనిని ఎదురుకునే సత్తా ఆళ్లనానికి ఉందని పార్టీ విశ్వసిస్తుంది. టీడీపీ,జనసేన పొత్తు వుంటే ఏలూరు నుంచి జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు కి కచ్చితమైన అవకాశం వుంది. ఇక వైసీపీ నుంచి బీసీ సామజిక వర్గం నుంచి మహిళకి అవకాశం ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు ఇప్పటికే నిర్ణయించాయి. ప్రస్తుత ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ కి ఏలూరు టికెట్ కన్ఫామ్ అయినట్టు సమాచారం. ఇప్పటికే షేక్ నూర్జహాన్ దంపతులు సీఎం జగన్ తో సన్నిహితంగ ఉండటం సీఎం జగన్ కూడా ఈ విషయం పైన సుముఖంగ ఉన్నట్టు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతుంది . అయితే నాని వర్గంలో షేక్ నూర్జహాన్ దంపతుల కి మధ్య జరుగుతున్నా చిన్న చిన్న వైరాలు ఆమెకి మద్దతు ఇస్తారా అనేది ప్రశ్నార్ధకమే. లేదా మ్మెల్యే నాని వర్గంలోనే మరొక బీసీ మహిళకి అవకాశం ఇవొచ్చు . జనసేన పొత్తులేకుంటే దివంగత టీడీపీ నేత బడితే బుజ్జి భార్య కి ఏలూరు సీటు ఇవ్వాలి అనే ఆలోచనలో వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *