fbpx

చిక్కుల్లో పడేసిన రాపాక నోటి దురుసు

Share the content

ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడిన మాటలు తనను చిక్కుల్లో పడేసాయి. జనసేన తరఫున గెలిచి వైసిపికి పనిచేస్తున్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ దొంగ ఓట్లతో గెలిచానని మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియాలో పూర్తిగా ట్రోల్ అయిన ఆ వీడియో నేను అలా అనలేదు అని సద్ది చెప్పుకున్నప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాపాక మాట్లాడిన వీడియో రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళింది. రాపాక వరప్రసాద్ మాట్లాడిన మాటల పైన సమగ్ర సర్వే చేసి నివేదిక ఇవ్వాలంటూ ఈసీ జిల్లా కలెక్టర్ కు లేఖ రాసింది.

కొంప ముంచిన నోటి దురుసు…

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఉండి ఎమ్మెల్యే రామరాజు తనను ఐదు కోట్లకి కొనబోయాడని స్వయంగా తానే ఓ కార్యక్రమంలో అన్నారు అదే సమయంలో తన నోటి నుండి దొంగ ఓట్ల వ్యవహారం బయటపడింది. దొంగ ఓట్లు వేయించుకునే గెలిచానని తన సొంత గ్రామం చింతమానూరులో కాపుల ఓట్లు లేవని అక్కడ ఎస్సీ, ఎస్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని అందుకే పక్క గ్రామం నుండి కొంతమందిని రప్పించి దొంగ ఓట్లు వేపిచామని ఒక్కొక్కరు 10 నుండి 15 దొంగ ఓట్లు గుద్దడం వల్లే 800 కు పైగా మెజార్టీతో విజయం సాధించానని విజయ రహసాన్ని బయటపెట్టారు. రాపాక వరప్రసాద్ నూటిదిరుసు తనని చిక్కుల్లో పడేలా చేసింది. తనకు ఓటు వేసిన అభిమానులు జనసైనికులు సైతం రాపాకపైన దుమ్మెత్తి పోశారు జనసేన కార్డుతో గెలిచి వైసిపికి అనుకూలంగా పనిచేస్తున్నాడని కడుపుమంటతో ఉన్న జన సైనికులకు రాపాక మాటలు మరి కాస్త ఆద్యం పోసాయి సోషల్ మీడియా వేదికగా రాపాకను ఒక ఆట ఆడుకున్నారు. నెత్తిన రూపాయి పెట్టిన అమ్ముడుపోని నిన్ను ఐదు కోట్లకు ఎవరు బేరం ఆడారంటూ ట్రోల్ చేశారు.

చర్యలు తీసుకోనున్న ఈసీ...

రాపాక మాట్లాడిన వీడియో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందిస్తూ రాపాక మాటల నిజమెంత విచరించి పూర్తి నివేదిక అందించాలని లేఖ పంపింది ఈసీ ఆదేశాల ప్రకారం వారం రోజుల్లో విచారించి పూర్తి నివేదిక ఇవ్వాల్సి ఉంది కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రాపాక పైన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోనుంది. వారం రోజుల్లో రాపాక ఎటువంటి చర్యలకుగురవుతారు అనే విషయం వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *