fbpx

కోర్టు తీర్పు దెబ్బకు అసలైన వివాదం వదిలేస్తున్నారు!

Share the content

చంద్రబాబు నాయుడు కేసులు విషయంలో పడి రాష్ట్రం మీడియా కృష్ణానది జలాల విషయాన్ని మరుగున పడేస్తోంది. కీలకమైన నది జలాల పంపిణీ విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరి, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నీటి అవసరాలను అంధకారంలో నెట్టేసేలా కనిపిస్తోంది. దీనిపై ఏ నాయకుడు కూడా పూర్తిగా స్పష్టతతో వైసీపీ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కోలేకపోవడం విశేషం. ముఖ్యంగా 2020లో ఎపెక్స్ కమిటీ మీటింగ్ లో వైఎస్ జగన్ మౌనంగా ఉండడం దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం కృష్ణ జలాల పంపిణీ విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో ఇటీవల కేంద్ర క్యాబినెట్ సైతం కృష్ణా జలాల పంపిణీ విషయంలో పునసమీక్షకు సిద్ధమైంది.

** బ్రిడ్జెస్ కురుమ ట్రిబ్యునల్ 2010లో ఇచ్చిన అవార్డులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నికరజలాలుగా 811 టిఎంసిలు కేటాయించింది. 2014లో రాష్ట్రం విభజన తర్వాత ఆ నికర జలాల్లో 34 : 66 పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పంచుకునేలా ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుల వారీగా ఉన్న అవసరాలు మేరకు ఈ నీటిని పంపిణీ చేసేలా కృష్ణ నీటి యాజమాన్య బోర్డును ఏర్పాటు చేశారు. ఇదంతా విభజన చట్టం సెక్షన్ 89 ఆధారంగా జరిగింది. అయితే తెలంగాణ మొదట్లోనే బ్రిడ్జెస్ కుమార్ ట్రిబ్యునల్ స్థానంలో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మళ్లీ నీటి పంపకాలు చేయాలని కోరింది. సుప్రీంకోర్టులో దీనిపై కేసు కూడా వేసింది. అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వివాదాలను పరిష్కరించేందుకు ఎపెక్స్ కమిటీ కేంద్ర జల శక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఏర్పాటు అయిన దానిలో 2020లో దీనిపై ఓ సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ ఆధ్వర్యంలో కేసీఆర్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కచ్చితంగా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని మళ్లీ జలాలను పంపిణీ చేయాలని కోరితే దానిని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి తోసిపొచ్చి మొదట సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ను వెనక్కి తీసుకోవాలని తెలంగాణను కోరారు. పిటిషన్ వెనక్కి తీసుకోవాలి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టిఎంసిల నీటిని మళ్లీ విభజించి రాష్ట్రాల వారీగా పంపిణీ చేయాలని కెసిఆర్ కోరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ కనీసం ఏ మాత్రం మాటలు లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మొదట సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కు తీసుకుంటే తర్వాత కృష్ణ జలాల మీద వేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ స్థానంలోని అవార్డును పున సమీక్ష చేస్తామని చెప్పారు. దానిని ఆధారంగా చేసుకొని ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆంధ్రకు కేటాయించిన 811 టిఎంసిలను మళ్లీ పునసమీక్షించాలని తీర్మానించింది. అంటే ఆ సమయంలో వైఎస్ జగన్ కేంద్ర మంత్రి మాటకు కేసీఆర్ మాటకు అడ్డుపడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టిఎంసిల మీదే మళ్లీ ఎందుకు సమీక్ష చేస్తారు అని గట్టిగా ప్రశ్నించి ఉండి, అడ్డుకుంటే కచ్చితంగా కేంద్ర క్యాబినెట్ ఇటీవల చేసిన తీర్మానం వచ్చేది కాదు. రాష్ట్ర విభజన సందర్భంగా కృష్ణ నది జలాల మీద 34 : 66 ప్రాతిపదికన జరిగిన పంపిణీ మళ్లీ పున సమీక్ష జరిగితే ఖచ్చితంగా తెలంగాణ వాటా పెరుగుతుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ నీటి అవసరాలు భవిష్యత్తులో కచ్చితంగా దెబ్బ పడతాయి. వైయస్ జగన్ చేసిన తప్పిదం ఆంధ్రప్రదేశ్ కు పెను శాపం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై కచ్చితంగా రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రతిపక్షాలు గట్టిగా నినదించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు గలమెత్తి పోరాడితే తప్ప ఈ విషయంపై ప్రజలకు అవగాహన కలగదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *