fbpx

ఐబీ సిలబస్ బోధన కోసం డాలర్ల ఒప్పందం.

Share the content

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యా వ్యవస్థలోని తెస్తున్న మార్పులు అస్తవ్యస్తంగా ఉన్నాయని విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని మొదటి నుండి ప్రతిపక్ష పార్టీలు తమ గొంతును వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించేందుకు మొన్నటి వరకు ఆంగ్ల మాధ్యమం అని తర్వాత సీబీఎస్ఈ సిలబస్ బోధన అంటూ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. ఇవి పూర్తిగా అమలులోకి రాకముందే ఇప్పుడు తాజాగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఐబి (ఇంటర్నేషనల్ బెకాలారేట్) సిలబస్ బోధన విధానాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం ప్రతియటా 4500 కోట్లు వెచ్చించేందుకు వైసిపి ప్రభుత్వం సిద్ధమవుతుంది.

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించేందుకు మొన్నటి వరకు ఆంగ్ల మాధ్యమం అని, తర్వాత సిబిఎస్ఈ సిలబస్ అన్నారు ఈ రెండు పూర్తిగా అమలు కాకముందే ఇప్పుడు ఐబీ సిలబస్ను విద్యార్థులపై రుద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఈ ఐబి క్యాలిక్యులం అనేది కేవలం ప్రపంచంలో 4 వేల పాఠశాలలో మాత్రమే అమలవుతున్న విధానం. ప్రపంచవ్యాప్తంగా ఐబీ సిలబస్ ఉన్న పాఠశాలలో భారతదేశం ఐదవ స్థానంలో ఉంటే దేశం మొత్తం మీద కేవలం 212 పాఠశాలలో మాత్రమే ఐబీ సిలబస్ అమలవుతుంది అంటే ఈ సిలబస్ అంతా ఉత్తమమైనది కాదని పలువురు విద్యావేత్తలు వారి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేంద్రం అనుమతుల కోసం ప్రతి పాఠశాలకు లక్ష చొప్పున సిలబస్ అమలుకు చెల్లించాలని కేంద్రం చెప్పడంతో సీబీఎస్ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టేసింది. రాష్ట్రంలోని కేవలం 1005 స్కూళ్లకు మాత్రమే ప్రస్తుతం సీబీఎస్ఈ అమలు అవుతుంది. అది కూడా కేంద్రం దయ తలచి 1005 పాఠశాలలకు లక్ష రూపాయలు సీబీఎస్ఈ సిలబస్ అమలు అనుమతులు ఉచితంగా ఇవ్వడంతో దాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి పాఠశాలకు లక్ష రూపాయలు చెల్లించలేని ప్రభుత్వం ఇప్పుడు ఐబి సిలబస్ అమలు కోసం ఒక్కొక్క పాఠశాలకు 13 నుండి 17 లక్షల మేర చెల్లించేందుకు సిద్ధమవుతుంది అంటే దీని వెనుక పెద్ద కథే నడుస్తుందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా సింగపూర్ కు చెందిన ఒక ప్రైవేటు కంపెనీకి ప్రభుత్వం అప్పచెప్పనుంది. ప్రతి పాఠశాలకు 3,72, 100 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీజ్ తో క్యాండిడేట్ ఫీజు రూపంలో మరొక 8,23,500 చెల్లించాలి. అంటే ప్రతి పాఠశాలకు ఏడాదికి 13 నుండి 17 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. అది కూడా కేవలం 600 సింగపూర్ డాలర్ లో చెల్లించాలి. డాలర్ విలువ పెరిగిన ప్రతిసారి చెల్లించాల్సిన మొత్తం కూడా భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం లేకపోలేదు దీనికోసం ఐబీ సీలబస్ అందించే సంస్థలతో 2029 వ సంవత్సరం వరకు ప్రభుత్వం ఒప్పందంకుదుర్చుకుంది వైసిపి ప్రభుత్వం. ఏది ఏమైనా విద్య వ్యవస్థల్లో వైసిపి తెస్తున్న మార్పులతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది. కనీసం విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు కూడా తీసుకోకుండా వారేం చదవాలో ప్రభుత్వమే విద్యార్థులపై రుద్దడాన్ని ప్రతిపక్షలతో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *