fbpx

రామోజీకి డైరెక్ట్ అటాక్!..

Share the content

ఈనాడు అనే సామ్రాజ్యాన్ని స్థాపించి నిర్విరామంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని విషయాలను శాసించిన పెద్దాయన రామోజీరావు కు జగన్ ప్రభుత్వంతో పెద్ద కష్టం వచ్చి పడింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఉషోదయ గ్రూపులు, మార్గదర్శి గ్రూపుల్లో వరుసగా సిఐడి దాడులు చేయడం ఆస్తులు అటాచ్ చేయడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలాంటి నిర్మోహమాటం పడకుండా ఏకపక్షంగా ఈనాడు సంస్థలపై చేస్తున్న ప్రత్యక్ష దాడులు వ్యాపారవేత్తల్లో పూర్తిగా చర్చ లేవదిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలోను ఈనాడును ఇబ్బంది పెట్టాలని చూసినా అది పూర్తిస్థాయిలో ఫలించలేదు. అయితే జగన్ మాత్రం ఏకపక్షంగా ఇప్పుడు ఈనాడును పెద్ద టార్గెట్ చేసుకొని అన్ని వైపుల నుంచి చక్రబంధం చేస్తున్నారు. ఏకంగా ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావే నిర్వేదంతో ఎందుకు ఈ ప్రభుత్వం ఇలా చేస్తుందో అంటూ దగ్గర వారి దగ్గర వాపోతున్నారు.

ఎవరూ కాపాడే వారు లేరు

పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వంలో ఎవరన్నా సరే రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఆశీస్సులు తీసుకోవాల్సిందే. ఢిల్లీ స్థాయిలో ఆయన లాబీయింగ్ లు బలంగా ఉంటాయి. అన్ని పార్టీల్లోనూ రామోజీరావుకు మిత్రులు ఉన్నారు. దాదాపు ఎవరు ఆయన జోలికి వచ్చే పరిస్థితి గతంలో ఉండేది కాదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రామోజీ ఫిలిం సిటీ భూముల వ్యవహారంతో పాటు మార్గదర్శి చిట్ఫండ్ వ్యవహారం తీవ్ర గందరగోళానికి గురి చేశాయి. రెవెన్యూ అధికారులు రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని అన్యాక్రాంతమైన భూములు ఉన్నాయని అప్పట్లో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చిట్ ఫండ్ నియమాలను మార్గదర్శి తుంగలో తొక్కి వ్యాపారం చేస్తోందని సుప్రీంకోర్టు లో సైతం పిటిషన్ వేశారు. ఆ కేసులో చాలామంది ప్రతివాదులుగాను చేరారు. అయితే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చాలావరకు ఈనాడు సంస్థల మీద పెద్దగా దృష్టి ఎవరిది లేదు. జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వరుసగా ఈనాడు మీద, ఆ సంస్థల మీద చేస్తున్న ప్రత్యక్ష దాడులు వణుకు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా కీలకమైన మార్గదర్శి చిట్ఫండ్ ఆస్తులను సుమారు 780 కోట్ల రూపాయలను అటాచ్ చేయడం సాధారణ విషయం కాదు. దీంతోపాటు చిట్స్ వేసిన వారిలో అపనమ్మకం సృష్టించేలా కూడా ఏకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం విశేషం. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా ఈనాడు మీద, ఆ సంస్థల మీద జగన్ ఉద్దేశం పూర్వకంగానే కక్ష కట్టిమరి ఇబ్బంది పెడుతున్నారు. మార్గదర్శి ఎండిగా రామోజీరావు కోడలు శైలజాకిరణ్, తర్వాత రామోజీరావును విచారణ పేరుతో సిఐడి ఇబ్బంది పెడుతుంది. అనునిత్యం విచారణ చేస్తూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే రామోజీ ఫిలిం సిటీ భూముల్లోనూ వేలు పెట్టాలని జగన్ ఆలోచించారు. అయితే కెసిఆర్ నుంచి సహకారం సందేశాలు రామోజీరావు విషయంలో రాకపోవడంతో జగన్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. లేకపోతే రామోజీ ఫిలిం సిటీ భూముల విషయంలోనూ ఇప్పటికే రచ్చ మొదలయ్యేది. మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారం అయిపోగానే ఈనాడు పత్రిక మూలాల్లో కూడా జగన్ చొచ్చుకు వెళ్తారని చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. అయితే జగన్ తర్వాతి టార్గెట్ ఏమిటి అన్నది మాత్రం ఇప్పుడు ఇప్పుడే బయటపడేలా కనిపించడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *