fbpx

టీటీడీ ఛైర్మన్ విషయంలో జగన్ తప్పు చేసారా??

Share the content

టీటీడీ చైర్మన్ గా అనుకోని విధంగా తెరపైకి వచ్చి, కీరకమైన పోస్టును కొట్టేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు సొంత పార్టీ నేతలకే అంతు పట్టకుండా ఉంది. ఏ ప్రభుత్వంలో అయినా టీటీడీ చైర్మన్ పదవి అనేది చాలా కీలకమైన పదవిగా భావిస్తారు. ముఖ్యంగా చైర్మన్ పదవి కోసం భారీ స్థాయిలో రేసింగ్ ఉంటుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం రెండుసార్లు సొంత బాబాయ్ చైర్మన్ పదవి ఇచ్చి సరిపెట్టిన జగన్ మూడో టర్మ్ కూడా బంధువు అయ్యే భూమన కే, రెడ్డి సామాజిక వర్గానికే ఛైర్మన్ పదవి అప్పగించడం ద్వారా తాను అనుకుంటే ఏదైనా చేయగలనని మరోసారి నిరూపించారు. ఇంత కీలకమైన పదవిలో మూడుసార్లు సొంత వ్యక్తులు అందులోను సొంత సామాజిక వర్గం వ్యక్తులను నియమించే పెద్ద డేరింగ్ స్టెప్ జగన్ వేశాడని చెప్పాలి. జగన్ అనుకోవాలి తప్ప సామాజిక వర్గ సమీకరణాలు, కచ్చితంగా ఇవ్వాల్సిన పదవులు, చేయాల్సిన పనులు అంటూ ఏమీ ఉండవు. జగన్ జస్ట్ అనుకుంటే చాలు తర్వాత అన్ని అలా సర్దుబాటు చేయొచ్చు అని మరోసారి టీటీడీ చైర్మన్ పదవిని భూమాకు ఇవ్వడం ద్వారా నిరూపించారు.

భూమన ఎం చెప్పారు?

భూమన కుటుంబానికి వైఎస్ కుటుంబానికి ఎప్పటి నుంచో స్నేహం ఉంది. భూమాన కరుణాకర్ రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. ఆ తర్వాత కాలంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చివరి తమ్ముడు రవీంద్రారెడ్డి కొడుకుకి భూమా కరుణాకర్ రెడ్డి కూతురుని ఇచ్చి బంధుత్వం కూడా కలుపుకున్నారు. 2019 ఎన్నికల్లో భూమన గెలిచిన తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చి చెప్పారు. 2024లో తిరుపతి నియోజకవర్గం నుంచి కొడుకు అభినయ్ రెడ్డి ని రంగంలోకి దింపాలని మొదటి నుంచి భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోను కార్పొరేటర్ చేయడం ద్వారా డిప్యూటీ మేయర్ పదవిని కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా తిరుపతి నుంచి పోటీ చేయనని పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న వేళ కీలకమైన పదవిని అప్పగించాలని భూమాన స్వయంగా కోరినట్లు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ పదవి స్వయంగా కావాలని భూమాన అడగడం అప్పటికప్పుడు, వచ్చే ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇచ్చినా సహకరిస్తానని స్వయంగా చెప్పడంతో భూమానకు రెండోసారి టీటీడీ చైర్మన్ గా అవకాశం కల్పించారు. ఇది చాలామందికి ఊహించని షాక్ లోకి తీసుకోని వెళ్లింది. ముఖ్యంగా మొదటి నుంచి వినిపిస్తున్న బీసీ నేత జంగా కృష్ణమూర్తి పేరును పరిగణలోకి తీసుకోకుండా జగన్ వ్యవహరించడం ఇప్పుడు వైసీపీ నేతలు సైతం సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి వచ్చింది. రెండు పర్యాయాలు రెడ్డి వర్గానికి చెందిన సుబ్బారెడ్డి కి చైర్మన్ పదవి అప్పగించడంతో కచ్చితంగా ఈసారి బీసీ వర్గానికి చెందిన జంగాకు చైర్మన్ పదవి దాదాపు ఇచ్చేసినట్లేనని భావిస్తున్న తరుణంలో భూమాను కరుణాకర్ రెడ్డి కి రెండో పర్యాయం కూడా చైర్మన్ పదవి అప్పగించడం జగన్ నియంత మనస్తత్వాన్ని తెలియజేస్తోందని విపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తానని చెప్పిన జగన్ చివరికి సొంత సామాజిక వర్గానికి న్యాయం చేసుకున్నారు అన్న మాటను మళ్లీ పడాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ జగన్ వేసిన డేరింగ్ స్టాప్ ఇప్పుడు అందరిని నివ్వెరపరుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *