fbpx

అనంతబాబును అక్కున చేర్చుకొని …సామాజిక సాధికార యాత్రలా : వి.శ్రీనివాసరావు

Share the content

దేశంలో మనువాద, మతోన్మాదుల పాలనలో దళితులు, ఆదివాసీలు, మహిళల మీద పెద్ద ఎత్తున దారుణమైన కులదురంకార దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని దళిత శోషణ్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు విమర్శించారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2024 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో “పూలే అంబేద్కర్ భవనంలో” జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం విభిన్నమైన స్థితిలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కో రకంగా డైరీ రావడం కులవ్యవస్థ కు పోరాడే కార్యకర్తలు, సామాజిక ఆలోచన చేసేవారికి కరదీపిక లాగా కాకుండ రోజువారీ తాజా సమాచారంతో డైరీ ఉందని ఆయన తెలిపారు.

దాడులను అరికట్టడంలో పాలక పార్టీలు విఫలం అవ్వడమే కాకుండ ముద్దాయిలను కాపాడంలో రక్షణ కల్పించడంలో మనువాద మతోన్మాద ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ధ్వజమెత్తారు. దళిత, గిరిజనులకు ఉన్న రక్షణ చట్టాలు కాలరాయబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు దళిత గిరిజనులకు భద్రత ఇవ్వడం లేదని వాపోయారు. రాష్ట్రంలో సామాజిక సాధికారత యాత్రలు జరుగుతున్న సమయంలోనే చాలాచోట్ల దుర్మార్గమైన దారుణమైన కులదురంకార దాడులు , అత్యాచారాలు , హత్యలు జరుగుతున్నాయని తెలిపారు. హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు లాంటి దుర్మార్గుడు పై చర్య తీసుకోకపోగా వెనుకవేసుకుని తిరుగుతూ ప్రభుత్వం నుంచి ఏలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.

విజయవాడ లోని స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరుగబోతున్నదుకు సంతోషమేనని, కానీ విగ్రహాం స్ఫూర్తిగా ఉంది అని అంటే కులవ్యవస్థ కు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి ప్రభుత్వమే న్యాయకత్వం వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు , మంత్రులు , ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని కులవ్యవస్థ కు వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలని పేర్కొన్నారు. అప్పుడే మన దేశంలో కులనిర్మూలన జరిగి అంబేద్కర్ కలలు నేరవేరుతాయిని వెల్లడించారు. సామాజిక న్యాయం సాధించబడుతుందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం చెబుతున్న పాలకులు హత్య చేసే అనంతబాబు లాంటి నేరస్తులను ప్రక్కన కుర్చోపెట్టుకుని ఉపన్యాసాలు ఇస్తే సామాజిక న్యాయం రాదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో దళిత గిరిజనులపై నేరాలు తగ్గాయని చెబుతున్నారు… కానీ జాతీయ నేర పరిశోధన సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం బిజెపి పాలిత రాష్ట్రాల చెంతన మన తెలుగు రాష్ట్రాలు చేరాయని రిపోర్టులు చెబుతున్నాయన్నారు. 2021 , 2022 , 2023 అనేక రెట్ల దాడులు , అత్యాచారాలు పెరిగాయన్నారు . 32 మందిని 2021 లో హత్య చేస్తే 2022 లో 52 మందిని హత్య చేశారన్నారు. సామూహిక దాడులు, అత్యాచారాలు పెరిగాయని పేర్కొన్నారు. సామాజిక సాధికారత యాత్రలు పేరుతో జస్టిస్ పున్నయ్య కమీషన్ సిఫార్సులు అమలులోకి తీసుకువచ్చి.. కులవ్యవస్థ కు వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లైతే పాలకులు మంచి పని చేసిన వారిగా ఉండేవారన్నారు. కులవ్యవస్థకు వ్యతిరేకంగా ప్రభుత్వాలే ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు.

కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ… మన దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని , ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ శక్తులకు దోచిపెడుతూ రిజర్వేషన్లు లేకుండ చేస్తున్నారన్నారని విమర్శించారు. సబ్ ప్లాన్ చట్టం తెస్తానని చెప్పిన మోడీ నిధులు కేటాయించడంలో వివక్ష చూపుతున్నారన్నారు . దళితులకు ఉన్న చట్టాలు అమలుకు పోరాడుతూ అసమానతలు లేని అభివృద్ధికరమైన సమాజ మార్పు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *