fbpx

ఆ క్రికెటర్ అక్కడి నుంచే పోటీ!

Share the content

మొన్నటి వరకు బ్యాట్ పట్టిన అంబటి రాయుడు ఇప్పుడు రాజకీయ నాయకుడు అవతారం ఎత్తనున్నారు. రిటైర్మెంట్ ప్రకటించినప్పుడే తనలోని రెండో కోణాన్ని చూస్తారని ప్రకటన ద్వారా తెలిపిన అంబటి రాయుడు వైసీపీకి మద్దతుగా ట్వీట్ చేయడం, ఆ వెంటనే వైసీపీ పక్షం సోషల్ మీడియా అంబటి రాయుడికి మద్దతుగా పోస్టులు పెట్టడం క్షణాల్లో జరిగిపోయింది. దీంతో దాదాపు అంబటి రాయుడు వైసీపీలోకి చేరతారని ప్రచారం జోరుగా జరిగింది. దానికి తగినట్లుగానే అంబటి రాయుడు అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వైసీపీలో చేరే అవకాశం ఉందని అంబటి రాయుడు సన్నిహితులు ద్వారా తెలుస్తోంది.

ఎంపీ టికెట్ ఆయనకేనా?

గుంటూరుకు చెందిన అంబటి రాయుడు దాదాపు తన ప్రస్థానం అంత హైదరాబాదులోనే గడిపారు. అయితే రాజకీయంగా మాత్రం మళ్లీ గుంటూరు వైపు అంబటి రాయుడు చూస్తున్నారు. సొంత జిల్లా కావడంతో గుంటూరు నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలని బలంగా భావిస్తున్నారు. దీనికి తగినట్లుగానే అంబటి రాయుడు వైపు నుంచి వైసీపీకు తగిన ప్రతిపాదనలు వెళ్లాయి. వచ్చే ఎన్నికల్లో అంబటి రాయుడును గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో అమర్ రాజా బ్యాటరీస్ ఎండీ గల్లా జయదేవ్ తెలుగుదేశం తరఫు నుంచి బరిలో నిలిచి వరుసగా రెండుసార్లు గుంటూరు ఎంపీగా గెలిచారు. జగన్ గాలిలోనూ గుంటూరు ఎంపీగా గల్ల జయదేవ్ గెలవడం పట్ల అప్పట్లోనే వైసీపీ అధినేత జగన్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఈసారి గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే స్టార్ డం ఉన్న క్రికెటర్ అంబటి రాయుడు ని వైసిపి ఎంపీ అభ్యర్థిగా నిలబడితే మిగిలిన నియోజకవర్గాల్లో సైతం ఆ ప్రభావం కనిపిస్తుందని జగన్ భావిస్తున్నారు. దీంతోపాటు అంబటి రాయుడు వైపు నుంచి కూడా సానుకూలంగానే దీనిపై ప్రతిస్పందన వచ్చే అవకాశం కనిపిస్తోంది.

రాష్టం అంతటా

క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అంబటి రాయుడు 2023 ఐపీఎల్ లో చెన్నై జట్టు సాధించడంలోని కీలక పాత్ర పోషించాడు. క్రికెట్ అభిమానులందరికీ అంబటి రాయుడు సుపరిచితుడే. దీంతో వచ్చే ఎన్నికల్లో అంబటి రాయుడు సేవలను రాష్ట్రమంతా వినియోగించుకోవాలని వైసీపీ భావిస్తోంది. ఆయనను ప్రచారానికి వాడుకోవాలని, పూర్తిస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయన సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది. కచ్చితంగా క్రికెట్ అభిమానులకు, అంబటి రాయుడు ఫ్యాన్స్ కు ఆయన దగ్గర అయ్యే అవకాశం ఉందని పార్టీకి ఇది లభిస్తుందని వైసీపీ గట్టిగా భావిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *