fbpx

జగన్ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తే ఇందిరా గాంధీకి పట్టిన గతే జగన్ కు పడుతుంది.

Share the content

దేశ ద్రోహుల మీద ప్రయోగించే ఎస్మా చట్టాన్ని అంగన్వాడీ ల మీద ప్రయోగించడం ఏమిటని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు.సోమవారం తిరుపతిలో అంగన్వాడీ లు చేస్తున్న సమ్మెకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ల మీద అధికారుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతుందని విమర్శించారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ ఎస్మా ప్రయోగించారని..చివరకి ప్రజా ఆగ్రహానికి గురి అయ్యారని తెలిపారు.ఎస్మా ప్రయోగించిన వారు ఎవరు తిరిగి అధికారంలోకి రాలేదని వెల్లడించారు.

ఎస్మా అనేది లక్ష మంది ఉన్న అంగనవాడి ల మీద ప్రయోగించటం కాదని…సిఎం మీద ప్రయోగిస్తే అన్ని సమస్యల కు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.అంగన్వాడీల సమస్యలను మానవత దృక్పథంతో పరిష్కరించకుండా ..ఎస్మాను ప్రయోగిస్తూ ఎంత మందిని అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మైన్స్ మాఫియా ను కాపాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లీడర్లు లేకుండా చర్చలు కు రావాలని..తిరుపతి కలెక్టర్ అంటున్నారని.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో నే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారుల ద్వారా బెదిరింపులకు,బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని ఇది అనైతికమని,అప్రజాస్వామికమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులే ఉత్సవ విగ్రహాలు గా ఉన్నారని.. అధికారాలు బెదిరింపులకు భయపడి సమ్మె విరమించేది లేదని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *