fbpx

అజేయమైనది కమ్యూనిజం.. భవిష్యత్ సోషలజిందే

Share the content

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించికుని మంగళవారం కాకినాడ జిల్లా వ్యాప్తంగా సిపిఐ జెండా ఆవిష్కరణల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26 న ఆవిర్భవించి స్వాతంత్ర్య ఉద్యమంలో నిర్బంధాలను ఎదుర్కొన్నది తెలిపారు. బ్రిటిష్ పాలనలో కమ్యూనిస్టులపై పెషావర్, మీరట్ లాంటి కుట్ర కేసులను పెట్టి ద్వీపాంతర, జైలు శిక్షలు వేశారని పేర్కొన్నారు.స్వాతంత్ర్యం అనంతరం దేశంలో సమ సమాజ నిర్మాణ స్థాపన కోసం కూడు, గూడు, నీడలేని నిరుపేదల అభ్యున్నతి కోసం కార్మిక, కర్షకుల హక్కుల కొరకు సీపీఐ పోరాడిందని తెలిపారు. భూస్వామ్య, పెత్తందారి విధానాలకు, జమీందార్, జాగీర్దారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడి లక్షలాది ఎకరాల భూములును పెద్దలకు పంచామని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ విభజన హామీలలో ప్రధానమైన ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మట్టి,నీళ్లతో సరిపెట్టడం, మూడు రాజధానుల పేరిట జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడడం, అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పై రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతికై రైతులు నాలుగు సంవత్సరాలుగా రోడ్డున పడి సుదీర్ఘ పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

  • సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వామపక్షాలు ,కాంగ్రెస్ మినహాయిస్తే అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు నేతలు బిజెపి నరేంద్ర మోడీకి వత్తాసు పలుకుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంటులో అనేక ప్రజా వ్యతిరేక బిల్లులకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ప్రధాన పార్టీలు వత్తాసు పలుకుతున్నాయని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో నిర్వహిస్తున్న పోరాటాలకు ప్రజలందరూ సంఘీభావాన్ని తెలియజేసి కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు టి అన్నవరం ఆదినారాయణ , రాజు,నారాయణ,శకుంతల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *